26.2 C
Hyderabad
December 11, 2024 17: 54 PM
Slider ఆధ్యాత్మికం ప్రత్యేకం

సత్యం న్యూస్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

dipavali

వయసు బేధం లేకుండా ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ దీపావళి. దీపాలు వెలిగించి, పటాసులు కాల్చి ఖుషీఖుషీగా గడిపే పండుగ దీపావళి. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది. చైతన్యాన్ని కలిగిస్తుంది. కమ్ముకున్న కారుచీకటి చీల్చివేస్తుంది. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాం. కృష్ణపక్షం 14 వ రోజు లోక కంఠకుడు నరకాసురున్ని శ్రీకృష్ణ సత్యభామలు వధించిన రోజు నరకచతుర్దశి. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా వచ్చేది దీపావళి పండగ.

దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాల వెలగించి చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండివంటలు, కొత్తబట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు.?

ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి? కార్తీక మాసంలో తులసిని పూజించి, తులసి ముందు ఒక్క దీపాన్నైనా ఉంచితే మంచి జరుగుతుందని నమ్మకం. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తుంటారు. ఇక్కడ వినిపించే ఇంకో పురాణ కథ ఏమిటంటే, మహాలయ పక్షంలో స్వర్గలోకం నుంచి భూలోకానికి దిగివచ్చే పితృదేవతలు, తిరిగి దీపావళి రోజు పితృలోకాలకు పయనమవుతారట. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందట.

ప్రతి హిందూ ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనకు కూడా అలాంటి కారణాలున్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధి జరిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది.

ఆ రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మా, సామాన్యులు నీకృపను పొందాలంటే ఏంచేయాలని అడుగాడట. అప్పుడు లక్ష్మీదేవి, ‘నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను’ అని బదులిస్తుందట.

అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కనక ఆరోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.

సత్యం న్యూస్ వీక్షకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు

Related posts

స్టడీ టూర్: జమ్మూకశ్మీర్‌ కు కేంద్ర మంత్రుల కమిటీ

Satyam NEWS

అక్రమ భారీ షెడ్డు నిర్మాణం: పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఎ సి పి

Satyam NEWS

దేశ వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించిన తెలంగాణ

Bhavani

Leave a Comment