40.2 C
Hyderabad
May 2, 2024 18: 54 PM
కవి ప్రపంచం

వచ్చెను వచ్చెను

#Chenepally Rajyalaxmi

వచ్చెను వచ్చెను ప్లవ నామ సంవత్సర మిదే అరుదెంచెను

వీచెను మలయా నిలంబులు కూర్మి మీర ప్రకృతి పరవశింప వేచిన హృదయాలలో,

పరవశత్వ మందింప చేయ వచ్చె నదిగో ప్లవ నామ వత్సరంబు.

కాంచన సమంబైన కోకిలమ్మలు సృష్టిని పులకరింప చేయువేళ

అఖిల లోకంబు ఆనంద పరవశ మందు వేళ అవతరించెను అవని యందు,

ప్లవ నామ వత్సరమిపుడే.

ఓ నూతన ప్లవా స్వాగతమో నీకు స్వాగతం.

విప్లవాత్మకమైన కరోనా లాంటి ఈతి బాధలనుండి ఊరట కల్పించి,

మమ్ముల ఆనందహేలల నోలలాడించుమా

శార్వరి దుర్భర జీవిత వాసనలన్,

మరుగున పడునట్లు సుఖశాంతుల నొసగుమా.

ఓ నవ్య ఉగాది షడృతువుల పరమార్ధమైన షడ్రుచుల తోడ

ఆరగించు వేప పచ్చడి విందు చేయ తెలుగు లోగిళ్ళలో చైతన్య దీప్తి నందించి వెలుగు దారుల మము నడిపింపుమా నూతన జీవన సంవిధానమునకు శ్రీకారమై ఎల్లరకు ప్రీతి నొసంగవలె

ఈ యుగాది నిలవాలి చక్కని ఖ్యాతి కీ ఆలవాలమై

మహిని ఆవరించిన పెనుమాయలు మటుమాయ మగునట్లుగా తెలుగు లోగిళ్ళ వెలుగులు తేజరిల్ల , హితము గూర్చగరమ్ము హే ప్లవ నామ వత్సరమా,

విప్లవ , విరోధములకు స్వస్తి పలుకగా సకల జనులకు హితము గూర్చగ

అరుదెంచినట్టి ఓ ప్లవా నీకు హార్షిక్ స్వాగతం.

ఆమని అరుదెంచినంతనే ప్రకృతి మురియు పల్లవించిన,

వనముల తోడ సర్వులకు శుభంబు లొసగి అధికధరల నియంత్రణలో

ఆగ్రగామియై సామాన్య , మధ్య తరగతి పౌరుల జీవన జ్యోతి వై

అలరారాలి నీవు , ఓ ప్లవ నామ వత్సరమా

సాదరంబుగ పల్కు చుంటి ని , నీకు హార్షిక స్వాగతంబు.

చీనేపల్లి రాజలక్ష్మి, హైదరాబాద్

Related posts

ఉపజ్ఞ కు ఉపద

Satyam NEWS

శ్రామిక నినాదం

Satyam NEWS

తెలుగు కీర్తి – మన పాముల పర్తి

Satyam NEWS

Leave a Comment