29.7 C
Hyderabad
May 2, 2024 04: 20 AM
కవి ప్రపంచం

శ్రామిక నినాదం

#Sujata P V L

అలుపెరుగని చేతులు

అలసిపోని చేతలు..

గుండెలు బీటలు వారినా

పట్టు సడలని మొండితనం

నిండు మనసులకు ఏనాడు నిలువ నీడ లేదు..

తెగిన మేఘాల నుండి

రాలిన చినుకుల తడి

చెమర్చిన కళ్ళనేనాడూ

తుడవ లేదు..

మండుతున్న ఎండని సైతం లెక్కచేయక..

మేడలు, మిద్దెలు కట్టిన కండలు..

రహదారులకై రాళ్ళెత్తిన చేతులు..

జానెడు పొట్టనేనాడూ నింపలేదు..

శ్రమజీవుల కాయకష్టాన్ని గుర్తించి..

శ్రమ దోపిడికి సంకెళ్ళు వేస్తూ..

పని గంటల భారం తగ్గిస్తూ..

సోషలిజం తెచ్చిన కార్మిక చట్టం

‘కార్మికుల దినోత్సవం!’..

అహర్నిశం శ్రమిస్తూ..

సమాజాన్ని ప్రగతి పథాన నడిపించే,

పని జీవుల స్వేద బలాన్ని

లోకానికి చూపిన

శ్రామిక నినాదం..’మే’డే.!!

సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్, చరవాణి:7780153709

Related posts

అమ్మవిశ్వంభర

Satyam NEWS

ఎవరు వీరు ?

Satyam NEWS

నీళ్ళాట – ఓ జీవన చక్రం

Satyam NEWS

Leave a Comment