42.2 C
Hyderabad
May 3, 2024 16: 02 PM
కవి ప్రపంచం

ఎక్కడుంది లోపం

#Brahmandapally Ravindrachary

ఏమో ఈ ప్రపంచమంతా ఎటుపోతుందమ్మో 

కత్తుల తోనే వంతెన వేసే కసాయి మూకమ్మో.

నీరు లేని ఊట బావులనడుగు.

చుక్క లేని సెల ఏరునడుగు.

ఎండుతున్న అపంటలనడుగు.

ఎగురుతున్న పాలపిట్ట నడుగు.

ఎక్కడుంది లోపం ఏమౌ తుందో లోకం..

కౌలు రైతుల చావులనడుగు .

కంటిలోని కనుపాపను అడుగు.

గుండెలోని అశ్వాసను అడుగు.

పండు టాకు ముసల్లోల్లను అడుగు.

ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం.

నింగిలోని అమబ్బులనడుగు.

పేదవాడి ఆకలిని నడుగు.

గర్భ గుడిలో నీ దేవుణ్ణి న డుగు.

గాడితప్పిన వ్యవస్థ న డగు.

ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం.

దుక్కి దున్నే రైతును అడుగు.

చదువుకున్న నిరుద్యోగి నీ అడుగు.

దగాపడ్డ కళా కారున్ని అడుగు.

గడచిపోయిన గతాన్ని అడుగు.

ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం.

బ్రాహ్మండ్లపల్లి రవీంద్రాచారి, (గవర్నర్ అవార్డ్ గ్రహీత) అర్తీజన్ కాలనీ, ఓదెల. పెద్దపల్లి జిల్లా, సెల్.9989464261

Related posts

వేంచేయవమ్మా ….

Satyam NEWS

రేకుల ఇల్లు

Satyam NEWS

శ్రమ సంస్కృతి దినోత్సవ”మే” డే

Satyam NEWS

1 comment

B.Ravindra chary April 13, 2021 at 3:21 PM

Super

Reply

Leave a Comment