37.2 C
Hyderabad
April 26, 2024 19: 22 PM
కవి ప్రపంచం

మనసు పడ్డా..

#Gundeti Ramana New

నేనొక ప్రేమ పిపాసిని..

గూడు చెదిరిన పక్షులై

వీధి గుమ్మపు  అంశలై

ఆర్తనాదము అనుభవించే

అనాధపై నే మనసు పడ్డా..!

భారమంతా భాగ్యమేనని

కాయమంతా కావ్యమేనని

సర్వ జనమును సాకునట్టి

అవనిపై నే మనసు పడ్డా..!

లక్ష్మి దేవతకలక్ష్యమై

కూడుగుడ్డల  కొరతయై

దరిద్ర దేవత తాండవించే

పేదపై నే మనసు పడ్డా..!

అతి కష్టమంతా ఇష్టమై

స్వేదమంతా సాంత్వనై

క్షణములోని కణము వదలని

శ్రామికునిపై  మనసు పడ్డా..!

తనువునే తామరగ చేసి

దేశమాత సిగనమెరసి

సమరమందున సాగిపోయే

సైనికునిపై మనసుపడ్ఢా…!

అవును నే మనసు పడ్డా…!

గుండేటి రమణ, బొమ్మెన, జగిత్యాల జిల్లా, చరవాణి 9949377287

Related posts

విశ్వ వ్యాపకుడు

Satyam NEWS

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS

నువ్వొస్తావనీ…!

Satyam NEWS

2 comments

Prasad Pidugu April 17, 2021 at 4:38 PM

Chala bagundi sir Kavita…

Reply
gundeti ramana April 18, 2021 at 5:14 PM

thank you prasadh

Reply

Leave a Comment