32.7 C
Hyderabad
April 27, 2024 01: 50 AM
Slider కవి ప్రపంచం

మానసవనం

#PVS Krishnakumari

మళ్ళీ వచ్చిన వసంతమా!

అదేమిటి, వసంతం మళ్ళీ రావటం ఏమిటి?

మన మనసే ఒక సతత  హరిత

ఉద్యానవనం అయితే అసలు

వసంతం ఎక్కడికి  పోతుంది

 మధురమైన అనుభూతులు

కోకిలమ్మ గీతాలై

రాగ రంజితాలవుతాయి

జీవితంలోని వివిధ దశలకు

ప్రతీకలైన ఋతువులన్నిటిలోను

 వసంతాన్ని వీక్షించే హృదయం నాది

గ్రీష్మం లోని మధుర ఫలాల రుచిని

ఆస్వాదిస్తున్నప్పుడు

మల్లెల సువాసనలు

మనసును తాకినప్పుడు

మనసు పాడుతుంది వసంతరాగం

వర్షాకాలంలో నిండు గర్భిణిలా ప్రవహించే

నదీ నదములను చూసినప్పుడు

మనసు అమృతవర్షిణే అవుతుంది

శిశిరం వచ్చినా

నా మనసు వసంతం గురించే ఆలోచిస్తుంది

నిరాశని దూరం చేసే  కొంగ్రొత్త ఆలోచనలు కూడా

వసంతానికి ప్రతీకలే

ఆశావాదినైన నాకు ప్రతి క్షణం వసంతమే

ఎపుడైనా మనసుగది శిశిరమైతే

ధైర్యమనే గవాక్షాన్ని తెరిచి

ఆశ అనే వసంతాన్ని  హృదయంలోకి

ఆహ్వానిస్తాను

ధైర్యం,ఆశ, ఓరిమి,భావుకత

పరోపకారాది గుణాలతో

నా మానస వనం ఎల్లప్పుడూ

వసంతం లోనే ఉంటుంది

పీ.వి.యస్.కృష్ణ కుమారి.

Related posts

ఇద్దరు అమ్మాయిల ప్రేమతో  రామ్ గోపాల్ వర్మ “డేంజరస్” 

Satyam NEWS

అత్యాచారయత్నం నిందితుడిని కాపాడే యత్నం?

Satyam NEWS

దేశానికి అన్నం పెట్టే రైతన్న పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment