40.2 C
Hyderabad
April 29, 2024 16: 22 PM
Slider కవి ప్రపంచం

రాదారి పాదాలు

#Venku Sanatani

ఆకలి ఓ రోకలి పోటు

పస్తు ఈ బతుకుకి శిస్తు

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి

రెక్కలు విరిచి దిక్కులకేసిందో రక్కసి

పరువే బరువై ఊరికి దూరమైంది బతుకు

పనులే కరువై ఊసుకి దూరమైంది మెతుకు

పెట్టె బేడా సర్దుకుని మూటాముళ్లూ కట్టుకుని

పిల్లాజెల్లాతో మొదలైంది మైళ్ళ ప్రయాణం

కదిలిన ప్రాణాలే అక్షర సత్యాలు

కమిలిన పాదాలే లక్షల సాక్ష్యాలు

పచ్చి బాలింతకు పట్టెడన్నం లేదు

పసిబిడ్డకు పాలెక్కడివి.?

ఏ చిత్రకారుని కుంచె గీచెనో

రాదారి పాదాల రక్తపు ఛాయలు

ఈ ఛైత్ర మాసాన నేల రాలెను

గూటికి సాగిన గువ్వల గుంపులు

వరసపెట్టిన వలస బతుకును

కసురుకున్నవి ఆకలి కేకలు

అరచి అరచి అలసిపోయి

ఉసూరుమన్నవి ఊపిరి తీగలు

వెంకు సనాతని, బాపట్ల, 9052596425

Related posts

అప్పుల భారం ఉన్న టాప్‌-10 రాష్ట్రాల్లో ఏపీ

Satyam NEWS

హైయ‌ర్ క‌ని కారు తీసుకెళ్లాడు…త‌ర్వాత ఫోన్ స్విచ్చాఫ్

Satyam NEWS

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment