33.7 C
Hyderabad
April 28, 2024 23: 33 PM
Slider కృష్ణ

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 8 ఏళ్ల క్రితం మీ స్వహస్తాలతో ఏర్పాటు చేసిన రాజధాని శంకుస్థాపన శిలాఫలకం మీ రాక కోసం ఎదురుచూస్తుందని, పదేపదే మిమ్మల్ని అడుగుతోందని అమరావతి బహుజన జేఏసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు చేశారు. గురువారం అమరావతి బహుజన జెఎసి ఆధ్వర్యంలో జెఏసి ఉపాధ్యక్షులు మామిడి సత్యం అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఐకాసా కన్వీనర్ పోతుల బాలకోటయ్య మాట్లాడారు. 2015 అక్టోబర్ 22వ తేదీన 34వేల ఎకరాల రైతుల భాగస్వామ్యంతో పురుడు పోసుకున్న రాజధాని అమరావతి శంకుస్థాపనకు మీరు వస్తే, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు హర్షించారని చెప్పారు. రాజధాని మహాక్రతువుకు దేశంలోని స్వాతంత్ర

సమరయోధుల జన్మస్థలాల నుంచి మట్టిని, నదీమ తల్లుల నుంచి పవిత్ర జలాలను తీసుకువస్తే హర్షించామని గుర్తు చేశారు. దేశం గర్వించదగిన రాజధానికి సహకరిస్తామని అభయమిస్తే ఆనందించామని చెప్పారు. దసరా పర్వదినాలలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి, రాజధాని మహా సంకల్పంలో పాల్గొన్నారని, ఇప్పుడా శిలాఫలకం శిధిలమై మీ రాకు కోసం ఎదురుచూస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిని రాజకీయ లడాయిగా మార్చాలని,

సమైక్యభావంతో మధ్యస్థంగా నిర్మించుకున్న రాజధాని నాశనం చేసి మూడు ప్రాంతంలో విభజన మంటలు రేగేలా మూడు రాజధానులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం ద్వారా ఏపీ ప్రజలకు హక్కుగా నిర్మించుకున్న రాజధాని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పినా సీఎం పెడచెవిన పెడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే, సరి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ఒక్క మాట చెబితే పరిష్కారం అయ్యే రాజధాని అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

విభజన చట్టం ద్వారా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని మూడువరాలు కూడా మూలన పడ్డాయని, హోదా ఇవ్వలేమన్నారని, పోలవరం కొర్రీలతోనే కాలయాపన చేస్తుందని, రాజధాని ముఖ్యమంత్రి మూడు జధానులతో అడవిగా మారిందని వివరించారు. అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జెఏసి కన్వీనర్ పి.వి. మల్లికార్జునరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కోరారు. విభజన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం ఎందుకు వివాదంగా మారిందో ముఖ్యమంత్రిని కనుక్కోవాలని చించారు.

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ రాజధాని మహోద్యమానికి మట్టి, నీళ్లు ఇస్తే దేశభావంతో ఉప్పొంగిపోయామని, అలాంటి రాజధాని అడవి కాచిన వెన్నెలగా మార్చారని విమర్శించారు. దళిత మహిళా జెఎసి కన్వీనర్ అంకం సువర్ణ కమల మాట్లాడుతూ గడప దాటని మహిళలు, గడప దాటి రాజధాని మహోద్యములో ల్గొంటున్నారని, కేసులతో, వేదింపులతో భూములు ఇచ్చిన మహిళలను చెరలు పెడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు లేవని, అరాచక పాలన కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో దళిత జేఏసీ కన్వీనర్ చిలకా బసవయ్య, రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు శిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖలో చంద్రబాబు పర్యటన కేసుల్లో 50 మంది అరెస్టు

Satyam NEWS

TRSKV ఆధ్వర్యంలో CM KCR కు క్షీరాభిషేకం

Satyam NEWS

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

Satyam NEWS

Leave a Comment