38.2 C
Hyderabad
April 29, 2024 21: 17 PM
Slider నల్గొండ

నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ లో భారీ కుంభకోణం

#nune venkatswamy

జిల్లాలో ఎక్కడా లేనివిధంగా రైతులకే తెలియకుండా,ప్రతి క్వింటా ధాన్యానికి 10 నుండి 20 కేజీల వరకు కటింగ్ చేసి బిల్లులు ఇచ్చిన చరిత్ర నకిరేకల్ మార్కెట్ కమిటీ దని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ లో కోటాను కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని,రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు.

 అందుబాటులో ఉన్న మార్కెట్ సూపర్ వైజర్  పంపిణీ చేస్తున్న బిల్లులు ఆపాలన్నాడు. బిల్లుల విషయంపై జిల్లా కలెక్టర్ కు రైతులు నివేదించనున్నారని, కలెక్టర్ ఆదేశాలు వచ్చే వరకు బిల్లుల పంపిణీ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో పిఆర్పీఏస్ నాయకులు కె.సత్యనారాయణ చారి, ఐతగోని మహేష్ గౌడ్,ఈదిగాని కుమార్ యాదవ్,నందిపాటి భూపాల్,గాదె నవీన్ మరియు బాధిత రైతులు, బి.జానకిరాంరెడ్ది, వెంకటరెడ్డి,మల్లారెడ్డి పాల్గొన్నారు.

Related posts

టెనెంట్ ఫైర్:అమెరికా కాల్పుల్లో ఇద్దరు పోలీస్ ల మృతి

Satyam NEWS

భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS

గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

Satyam NEWS

Leave a Comment