ఓ ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న వ్యక్తిని ఖాళీ చేయమనడం తో ఆగ్రహించి కాల్పులు జరిపిన సంఘటన ఇది.అమెరికాలోని హోనోలులులో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. తుపాకీతో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో అధికారులు అతడిని ఎదుర్కొనే క్రమంలో దుండగుడు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని హవాయి గవర్నర్ తెలిపారు.
ఇంటి యజమాని దుండగుడిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసు జారీ చేయడంతో ఘర్షణ జరిగిందని, ఇంటి యజమానిపై సైతం దుండగుడు కత్తితో దాడి చేసినట్టు గాయాలతో అయన ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం.