29.7 C
Hyderabad
April 29, 2024 10: 56 AM
Slider మహబూబ్ నగర్

స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా పూర్తిచేయాలి

ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.

గురువారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ నూతన, రెన్యూవల్ ఉపకార వేతనాలపై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటి విద్యార్థుల ఉపకార వేతనాలు మంజూరు చేయుటకు ఆన్ లైన్ లో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిశీలించి, జనవరి 31వ తేదిలోపు పూర్తిచేయాలని ఆమె సూచించారు.

18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్ నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. రెడ్ క్రాస్ కు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేసి బంగారు పతకం సాధించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అధికారిని నుషిత, డి. ఈ. ఓ. రవీందర్, అనిల్, డి ఐ ఈ ఓ. జాకీర్, మైనారిటీ అధికారిని కాళి క్రాంతి, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టాప్ 5 లోకి దూసుకెళ్లిన షట్లర్ పీవీ సింధు

Satyam NEWS

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష కు వస్తున్న కేంద్ర బృందం

Satyam NEWS

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS

Leave a Comment