23.2 C
Hyderabad
May 8, 2024 00: 29 AM
Slider ప్రత్యేకం

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Chief Minister Jagan Mohan Reddy

వచ్చే ఏడాది మార్చి వరకు  కేవలం ఐదు వేల కోట్ల రూపాయల  రుణంతోనే అప్పుల జగన్నాథం  బండిని నడిపించగలడా?,   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 30,2,75 కోట్ల రూపాయల రుణ వెసులుబాటు బాటు కల్పించింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరువు అరుపులు అరుస్తూ,   6 వేల కోట్ల రూపాయల అప్పులను లాగేసింది.

రానున్న మంగళవారం మరో 3500 కోట్ల రూపాయల అప్పును ఎత్తేందుకు సిద్ధమయింది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిన రుణ వెసులుబాటు లో నుంచి పాత బకాయిల కింద 16 వేల కోట్ల రూపాయల కోత విధించారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం  70 వేల కోట్ల రుణ వెసులుబాటు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రతి ఏడాది ఏప్రిల్ లో  ఆర్టికల్ 293 (3) ప్రకారం జి ఎస్ డి పి ఆధారంగా  రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రుణ వెసులుబాటును నిర్దేశిస్తుంది.

తమ జి ఎస్ డి పి  అధికంగా ఉందని దొంగ లెక్కలను చూపించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం నిష్ణాతులు. రాష్ట్ర జిఎస్ డీ పీ 14 లక్షల 50 వేల కోట్ల రూపాయలుగా ప్రకటించారు. జి ఎస్ డి పీ లో ప్రతి రాష్ట్రానికి  మూడున్నర శాతం మొత్తం రుణ వెసులుబాటు లభిస్తుందన్నారు. శుక్రవారం నాడు  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 70 వేల కోట్ల రూపాయల రుణ దీవెనకు జగనన్న దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి తాను గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశాను. ప్రధానమంత్రి కి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో  తనని రోగ్ ఎంపీ అని సంబోధించారు. ఎవరు రోగో అందరికీ తెలుసు. నేను రఘునని ఆయన పేర్కొన్నారు.

ఎంత కాళ్ళ వేళ్ళ పడ్డ  అదనంగా మరో ఐదు నుంచి 6 వేల కోట్ల రూపాయల అప్పు లభించవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సంగతి ఏమిటి?. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏమవుతుందన్న  ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమవుతుందో తెలియడం లేదు. నెలకు రెండు వేల కోట్ల రూపాయలు  మద్యం ద్వారానే ఆదాయం లభిస్తున్నట్లుగా బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు  వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నవన్ని గత ప్రభుత్వాల హయాం లో అమలు జరిగిన సంక్షేమ పథకాలే. కొత్తగా ఆయన అమలు చేస్తున్నది ఒక్క అమ్మ ఒడి పథకం  మాత్రమే నని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. సంక్షేమ పథకాలన్నీ  తానే కొత్తగా  ప్రవేశపెట్టినట్లుగా  జగన్మోహన్ రెడ్డి బిల్డప్ ఇస్తూ, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ విషయమై ప్రజలు ప్రశ్నించాలి. వైయస్సార్ తోఫా, కళ్యాణమస్తు పథకం గత నాలుగేళ్లుగా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునే జంట పదవ తరగతి  ఉత్తీర్ణులయితే  వైఎస్ఆర్ తోఫా, కళ్యాణమస్తు పథకానికి అర్హులట.

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం లో పదవ తరగతి పాసైన వారు ఎంతమంది ఉన్నారు. వారి సర్టిఫికెట్లను చూపించాలి. పదవ తరగతి కూడా చదవని వారికి మంత్రివర్గంలో చోటు కల్పించిన జగన్ మోహన్ రెడ్డి, పెళ్లి చేసుకునే జంట పదవ తరగతి పాస్ అయితేనే   ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హులని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. పదవ తరగతి పాస్ కాకపోతే  పెళ్లికి అర్హులు కారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్సార్ తోఫా, కళ్యాణమస్తు పథకానికి  అర్హులైన వారికి కోత పెట్టడానికి ఈ కొత్త నియమ నిబంధనలన్నారు.

గత ప్రభుత్వాన్ని తిడుతూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం పెద్ద బూతు

గత ప్రభుత్వాన్ని తిడుతూ, ఈ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం పరమ బూతు. ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన  శాఖ అధికారులను అరెస్టు చేయాలి. గత ప్రభుత్వం పెళ్లి చేసుకున్న జంటకు లక్ష రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వం లక్షన్నర రూపాయలు ఇస్తామని చెప్పింది. తక్కువ చెప్పి ఇచ్చిన వాడు గొప్ప?, ఎక్కువ చెప్పి ఇవ్వని వాడు గొప్ప?? అన్నది ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

గత నాలుగేళ్ల తరువాత వైయస్సార్ తోఫా, కళ్యాణమస్తు పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 87  కోట్ల రూపాయలు ఖర్చు చేసి , ఒక్క రోజు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ కోసమే 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. చారానకోడికి భారాన మసాలా అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో అమలైన స్కీములను ఒక వైపు చూపిస్తూ, ప్రస్తుత ప్రభుత్వంలో అమలవుతున్న  సంక్షేమ పథకాలను మరొకవైపు పత్రికా ప్రకటనల్లో  ప్రస్తావిస్తూ  వ్యత్యాసాన్ని పోల్చి చూపే ప్రయత్నాన్ని చేస్తున్నారు.

అయితే, గత ప్రభుత్వ హయాంలో  అన్నదాత సుఖీభవ పేరిట రైతుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించేవారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట 6,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా కలుపుకొని  తానే 12,500 రూపాయలను రైతులకు ఇస్తున్నట్లుగా మభ్య పెట్టే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి  చేస్తున్నారు.

ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాయగా, చివరకు కనిపించి కనిపించినట్లు ఉండేలా ప్రధానమంత్రి కిసాన్ యోజన  పథకం పేరు ను రాస్తున్నారు. బటన్ నొక్కే కార్యక్రమంలో ద్వారా 40 వేల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛన్ 200 నుంచి 2000 రూపాయల వరకు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  2000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్ ను 2, 250 చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్ల  చెల్లింపుకు 15 వేల  కోట్ల రూపాయలు ఖర్చు కాగా, ప్రస్తుతం 20 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.

గత ప్రభుత్వ హయాంలో కంటే, ప్రస్తుతం పెరిగిన  ఖర్చు కేవలం 5000 కోట్ల రూపాయలు మాత్రమే. అయినా, గత ప్రభుత్వాల హయాంలో వృద్ధుల గురించి ఎవరు ఆలోచించనట్లు, తానేదో వృద్ధులను ఉద్ధరించడానికి పుట్టినట్టుగా  జగన్మోహన్ రెడ్డి  ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. గత ప్రభుత్వాల హాయాయంలో  చేసిన సహాయాన్ని చెప్పకుండా, తమ ప్రభుత్వ హయాంలో  గొప్పగా చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరం.

వృద్ధాప్య పింఛన్లను  నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేయవచ్చు. బ్యాంకులో జమ చేసిన మొత్తాన్ని డెబిట్ కార్డు ద్వారా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ  డిజిటల్ పేమెంట్ ల వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం రాష్ట్రంలోని మద్యం దుకాణాలు మినహా, అన్ని షాపులలోనూ డిజిటల్ పేమెంట్లనే కొనసాగిస్తున్నారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం, అలా చేయడానికి సుముఖంగా లేదు. ఎందుకంటే 20, 000 కోట్ల రూపాయల నగదును బ్యాంకులో నుంచి డ్రా చేసి  వృద్ధులకు  నేరుగా అందజేస్తే, వారి కొడుకులు ఆ మొత్తాన్ని  లిక్కర్ షాపులలో ఖర్చు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పథకంగా కనిపిస్తోంది . వృద్ధాప్య పింఛను మొత్తాన్ని ఇవ్వనందుకు ఒక వృద్ధున్ని ఆయన కన్న కొడుకే హత్య చేసిన సంఘటన ఇటీవల చోటు చేసుకుంది.

గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను పేర్కొనడం ద్వారా, ప్రస్తుతం తాను అమలు చేస్తున్న పథకాలన్నీ  గత ప్రభుత్వంలో   అమలు చేసినవేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.  జగనన్న విద్య, వసతి దీవెన అనే పథకం పాతదే అయినా ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోంది. విద్యా దీవెనలు భాగంగా మూడు క్వార్టర్ల మొత్తాన్ని  విద్యార్థులకు ఇవ్వలేదు.

గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎన్నో పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదు. అమ్మ ఒడి పథకాన్ని తల్లులకు ఇవ్వడం కాదు,   స్కూల్ యాజమాన్యానికి ఆ మొత్తం ఇవ్వాలి. 40 వేల కోట్ల రూపాయలలో 6000 కోట్ల రూపాయలు అమ్మఒడి కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమమంతా శూన్యం. అమ్మ ఒడికి ఖర్చు చేసింది ఈ నాలుగేళ్లలో కేవలం 24వేల కోట్ల రూపాయలు మాత్రమే. 

ఇవ్వాల్సిన బకాయిలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ అప్పులు  10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అప్పుల వివరాలు అడిగితే చెప్పరు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు ఎన్నో వివరించారు. కార్పొరేషన్లు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలని చేసిన అప్పులు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రానున్నవి చాలా క్లిష్టమైన రోజులు. కాంట్రాక్టర్లకు మరో ఏడాది పాటు  బిల్లులు రాకపోవచ్చు. అయినా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాష్ట్రంలో ఒకవైపు పన్నుల పోటు, మరొకవైపు విద్యుత్ చార్జీల మోత, 17వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను బాదిన  ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో హింస తప్ప మరొకటి లేదు

దిక్కుమాలిన ఈ ప్రభుత్వ హయాంలో హింస తప్ప మరొకటి లేదు. జీవో నెంబర్ 1 రద్దు చేయమని ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టులో వాదనలు విని తీర్పు  రిజర్వు చేసి ఐదు నెలలు కావొస్తుంది. ఈ మధ్యలో సుప్రీంకోర్టును తలుపు తట్టి , మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. హైకోర్టులోనే తాము ఇచ్చిన ఆర్డర్ ను చూపించి, మధ్యంతర స్టే అడగాలని సుప్రీంకోర్టు సూచించింది.

తీర్పు ఇవ్వడానికి తీరికలేని న్యాయస్థానాలు ఉండడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఒక సమీక్ష సమావేశం నిర్వహించి జీవో నెంబర్ 1 ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించడం సిగ్గుచేటు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ పర్యటనలకు  ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతను పొలాల్లోకి వెళ్లకుండా పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు.

కొంపలో కూర్చుండే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్ష నేత  క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలిస్తుండడంతో, ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఉత్తుత్తి ప్రకటనలు చేసి  చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది.

ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం లేదు కనకే, న్యాయస్థానంలో తీర్పు రావడం  ఆలస్యం అవుతుందేమో అన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదు. న్యాయమూర్తికి సమయం చిక్కితే తీర్పు వెలువరిస్తారని ఆశిద్దాం. ఈ లోగానే  ప్రధాన ప్రతిపక్ష నేత ప్రచార రథాన్ని అనుమతి లేదన్న కారణంగా అడ్డుకోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను తీసుకురావడం ఏమిటో?,వాటిపై న్యాయస్థానాలు  ప్రతి స్పందించకపోవడం ఏమిటో?, కోర్టులలో తీర్పులు నెలల తరబడి పెండింగ్లో  పెట్టడం ఏమిటో?, ముఖ్యమంత్రి రివ్యూ మీటింగులు పెట్టి మాట్లాడడం ఏమిటో?, ప్రధాన ప్రతిపక్ష నేతను పంట పొలాలను పరిశీలించకుండా అడ్డుకునేందుకు భారీకేడ్లు ఏర్పాటు చేయడం ఏమిటోనని రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రైతులకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందేమో?

రాష్ట్ర రాజధాని రైతులకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తుందేమోనన్న అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులకు  అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి మనస్కరించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేదలకు మాత్రం 52 వేల  ప్లాట్లను ఇస్తానని చెప్పడం  ఆశ్చర్యంగా ఉంది. హైకోర్టులో ఒకవేళ  రైతులకు తీర్పు వ్యతిరేకంగా వస్తే, సుప్రీంకోర్టులో  జగన్మోహన్ రెడ్డి దాతృత్వం గురించి చెబుదామని  ఎవరు అధైర్య పడవద్దని రఘురామకృష్ణం రాజు సూచించారు.

రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరిగితే అదృష్టం. ఒకవేళ న్యాయం జరగకపోయినా తీర్పు వెలువడితే పరమ అదృష్టం. న్యాయస్థానాలపై ప్రజలు ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒకవేళ న్యాయస్థానాలలో న్యాయం జరగడం ఆలస్యం అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్దాం. న్యాయస్థానాల వల్లే తాను ఇంకా బ్రతికి ఉన్నాను. లేకపోతే ఈ దుర్మార్గుడు  తనని చంపివేసి ఉండేవాడు. న్యాయస్థానాలలో జరుగుతున్న ఆలస్యాన్ని లా అండ్ జస్టిస్ కమిటీ గ్రీవెన్స్ దృష్టికి తీసుకువస్తే తాను కూడా  కమిటీలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తానని  రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు.

Related posts

సైబర్ నేరాలను కట్టడి చేయడానికి నూతన ఎస్సైలు సమాయత్తం

Satyam NEWS

ప్రాణాలతో చెలగాటం అడుతున్న తాత్కాలిక డ్రైవర్లు

Satyam NEWS

డబుల్ ఓట్లపై నిగ్గు తేల్చండి

Bhavani

Leave a Comment