29.7 C
Hyderabad
May 2, 2024 03: 43 AM
Slider శ్రీకాకుళం

సైన్స్ డే: నేటి విద్యార్ధులే రేపటి తరం శాస్త్రవేత్తలు

patrunivasasa science day

శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రునివలస గ్రామంలో ఉన్నత పాఠశాలలో  ఘనంగా సైన్స్ డే దినోత్సవవేడుకలు జరిగాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి వి రామన్ కనుగొన్న రామన్ఎఫెక్ట్ రోజు అయిన ఫిబ్రవరి 28 ని జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం గా నిర్వహించుకుంటున్నాం.

ఈ సందర్భంగా పాత్రునివలస స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎం పి యు పి స్కూల్ తంగి వాని పేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రునివలస విద్యార్థులు విజ్ఞానశాస్త్ర ప్రాజెక్టులు ప్రదర్శించారు.

స్థానిక ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్ మాట్లాడుతూ భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇటువంటి ప్రదర్శనలు చాలా దోహదం చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో క్విజ్ పోటీలలో  ప్రథమ స్థానం గా ఎం పి యు పి పాఠశాల తాంగి వాని పేట, ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రునివలస తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపాడు బహుమతులు గెలుచుకున్నాయి.

ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కరణం శ్రీహరి,  బుడుమూరు అప్పలనాయుడు, డి. అప్పారావు, బి. ప్రభాకర్ రావు, బి.వి.అరుంధతి దేవి, పి. వసంతరావు, జి.వినయ్ కుమార్, ఆర్ సతీష్ రాయుడు, ఎస్ జి .సురేష్, కె .నరేష్ కుమార్, రవి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప‌శుప‌తినాథ్ ఆల‌యంలో ఆఖ‌రి కార్తీక మాసం పూజ‌లు

Sub Editor

రోడ్డు పనులకు భూమి పూజ

Satyam NEWS

సిద్దమవుతున్న టి‌ఎస్‌పి‌ఎస్‌సి

Sub Editor 2

Leave a Comment