30.3 C
Hyderabad
March 15, 2025 10: 39 AM
Slider జాతీయం

ఫ్రూట్ ఫుల్ సెర్చ్ : సంకల్పబలం 20ఏళ్ల తరువాత తల్లితో

ofter 20 years serching found mother

చిన్నప్పుడే తప్పిపోయి నా అన్న వాళ్లకు దూరమై అష్టకష్టాలు పడ్డ ఆ యువకుడికి తన తల్లిని ఎలాగైనా కలవాలిని సంకల్పం ఫలించింది.9ఏళ్ల వయసులో ఇంట్లోనుండి వెళ్ళిపోయి తమిళనాడు లో బ్రతికిన అతను చివరకు యాదృచ్చికంగా తన కుటుంబ సభ్యులను కలుసుకోవడం కొసమెరుపు.వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా అరకులోయ మండలం బొండాం పంచాయతీ మజ్జివలసకు చెందిన గంగాధరన్ బాల్యంలో విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిపోయాడు.

పొరపాటున చెన్నై రైలెక్కాశాడు. చెన్నై చేరుకున్న బాలుడిని అక్కడి పోలీసులు అప్పట్లో అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే పెరిగి పెద్దవాడై ఎల్ ఐసీలో ఉద్యోగం చేస్తున్నాడు.అరకులోయ ఫొటోలు చూస్తున్న అతనికి తన బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తన సొంతూరు అదేనని, తల్లిదండ్రులు అక్కడే ఉంటారని భావించి వెతికేందుకు పండగ ముందు నగరానికి చేరుకున్నాడు.తమిళం తప్ప ఏమీ రాని గంగాధరన్ చెప్పిన వివరాలతో అతని కుటుంబ సభ్యులను పట్టుకోవడం పోలీసులను ఆశ్రయించగా వారికి , స్థానికులకు సాధ్యం కాలేదు.

ఈ వెతుకులాటలో ఉండగా నే అరకుకు చెందిన సింహాద్రితో గంగాధరన్ కు పరిచయం అయ్యింది. సంక్రాంతికి తన ఇంటికి రావాల్సిందిగా ఆమె ఆహ్వానించడంతో వారింటికి వెళ్లాడు. అక్కడ తన బాల్యం నాటి ఫొటో చూసి గుర్తుపట్టడంతో తాను చేరాల్సిన ఇంటికే చేరానని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తప్పిపోయిన బిడ్డే తిరిగి వచ్చాడని తెలియడంతో ఆ తల్లి ఉబ్బితబ్బిబ్బయ్యింది. విషయం పోలీసులకు చేర్చడంతో వారు గంగాధరను తల్లి సింహాద్రి, అతని తమ్ముడు, చెల్లెలకు అప్పగించారు.

Related posts

ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

Satyam NEWS

పౌరులందరికీ సైబరాబాద్ పోలీసు వారి విజ్ఞప్తి

Satyam NEWS

ఏలూరులో కురిసి కుంభవృష్టితో ఇబ్బంది

Satyam NEWS

Leave a Comment