38.2 C
Hyderabad
May 2, 2024 21: 38 PM
Slider ప్రత్యేకం

దళిత బంధు రెండో దశ ఉత్తర్వులు జారీ

#kcr

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పధకం రెండో విడతకు సంబందించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ నియోజకవర్గంలో 1115 మందికి దళిత బంధు పధకం అమలు చేయనున్నారు. దళిత బంధు రెండో విడుత ఉత్తర్వుల జారీ పట్ల రాష్ట్ర ఎస్సి అభి వృద్ది మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ లు పధకం లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలనీ సూచించారు.

దళితుల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటికే తొలి విడతలో దళిత పధకం ద్వారా లబ్ది పొందిన పలువురు ఉన్నత మైన జీవనం సాగిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.   రానున్న ఎనిమిదేళ్ల లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు.  విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు తిప్పి కొడుతున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై. ముఖ్యమంత్రి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు.

Related posts

మరింత కఠినంగా రెండో దశ లాక్ డౌన్ నిబంధనలు

Satyam NEWS

గిద్దలూరును టిడిపికి కంచుకోటగా మార్చాలి….

Bhavani

డు నాట్ వర్రీ: పెన్షన్లను పంపిణీ చేసిన సర్పంచ్ అనిత

Satyam NEWS

Leave a Comment