30.7 C
Hyderabad
April 29, 2024 05: 14 AM
Slider క్రీడలు

సమష్టి భావన కోసమే ఈ ఒలింపిక్ రన్…!

#olympicrun

క్రీడల ద్వారా అందరిలో సమష్టి భావన నెల కొల్పడమే….ఒలింపిక్ రన్ ..లక్ష్యమని విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనసేన పార్టీ నేత ,ప్రముఖ వ్యాపార వేత్త గురాన అయ్యలు అన్నారు. ఈ నెల 23 ఒలింపిక్ డే అయినప్పటికీ… విద్యార్ధినీవిద్యార్థుల కు సెలవు రోజు కావడంతో… ఈ 25వ తేదీ న ఆదివారం ఈ ఒలంపిక్ రన్ నిర్వహించామన్నారు. ఈ రన్ ద్వారా అందరిలో సమిష్టి భావన…అంతరాలు లేకుండా… సమైక్యంగా ఉండేందుకే.. అసోసియేషన్ ఈ ఒలింపిక్ రన్ నిర్వహించిందన్నారు.

ఈ మేరకు నగరంలో పాత బస్టాండ్ రాజీవ్ క్రీడా మైదానం నుంచీ ఒలింపిక్ రన్ ప్రారంభమై…న్యూపూర్ణ, గంటస్థంభం, మూడులాంతర్లు ,కోట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎంఎల్సీ పాకలపాటి రఘువర్మ..ఒలింపిక్ రన్ నేపథ్యంలో క్రీడా జ్యోతి వెలిగించి…అంతర్జాతీయ వెయిట్ లిప్టర్ క్రీడాకారిణికి అందజేయడంతో రన్ ప్రారంభమైంది. ఇక నగర రోడ్ల పై ఒలింపిక్ రన్ సాఫీగా సాగేందుకు… ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్ఐ లు రాజు ,త్రినాథ్, ప్రసాద్ లు…ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ రన్ లో అన్ని క్రీడల అసోసియేషన్ లతో పాటు మన్మధ కుమార్, శ్రీనివాస్, సురేష్,తో పాటు..క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related posts

గన్ పార్క్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

Satyam NEWS

జగన్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ చార్జిషీట్

Satyam NEWS

పాలమూరు ప్రజాభేరి వాయిదా..?

Bhavani

Leave a Comment