29.7 C
Hyderabad
May 1, 2024 10: 40 AM
Slider విజయనగరం

సీఎం జగన్ పర్యటనకు 900 మంది తో పటిష్టమైన బందోబస్తు

#sp

విజయనగరం లో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవన ప్రారంభోత్సవానికి ఈ నెల 15న విచ్చేస్తున్న సీఎం జగన్ భద్రతకు సుమారు 900మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక  తెలిపారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తును వివిధ కేటగిరిలుగా విభజించి, భద్రత ఏర్పాట్లు చేసామని, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.

హెలిప్యాడ్, పార్కింగు, కాన్వాయ్, వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ, శిలా ఫలకం, రూట్ బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగు, వైద్య కళాశాల భవనం వద్ద విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులు గురించి ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనే ముఖ్య వ్యక్తుల వాహనాలను, కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే వారి వాహనాలను నిలిపేందుకు పార్కింగు స్థలాలు ఏర్పాటు చేసామన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాను, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని భద్రతాచర్యలు చేపట్టామని, బందోబస్తు నిమిత్తం ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలతో సుమారు 900 మందితో బందోబస్తు ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ, శిలాఫలకం, మెడికల్ కాలేజ్ భవనం వద్ద భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ మరోసారి సమీక్షించి, అధికారులు, సిబ్బందికిజిల్లా ఎస్పీ ఎం. దీపిక పలు సూచనలు చేసారు.

జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్, విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, దిశ డీఎస్పీఆర్.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీధర్, చీపురుపల్లి డీఎస్పీ ఎ.ఎస్. చక్రవర్తి, డిటిసి డీఎస్పీ వీరకుమార్, ఎఆర్డీఎస్పీ యూనివర్స్, ఎస్బీ సీఐలుకే.కే.వి.విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి, వన్ టౌన్  సీఐ డా. బి. వెంకటరావు, టూటౌన్ సీఐ ఎన్.హెచ్.వి.ఆనంద్, సీసీఎస్ డీఎస్పీసిఐ ఎం. బుచ్చిరాజు, డీసీఆర్బి సీఐ జె. మురళి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

తెలంగాణ గ్రూప్ 1 అధికారుల అధ్య‌క్షుడి ఎన్నిక‌

Sub Editor

ఒడిశా రైలు ప్రమాదంపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి ప్రధాని మోడీ ప్రశంస

Satyam NEWS

Leave a Comment