42.2 C
Hyderabad
May 3, 2024 15: 17 PM
Slider శ్రీకాకుళం

జాతీయ ఫెన్సింగ్ పోటీలకి శర్వాణీ విద్యార్ధి ప్రణయ్

#Srikakulam

 ఈ నెల 25 నుంచి 28 వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో జరగననున్న జాతీయస్థాయి పెన్సింగ్ పోటీలకు నరసన్నపేటలోని శర్వాణీ విద్యాలయంలో ఏడవ తరగతి చదువుతున్న దిబ్బ ప్రణయ్ ఎంపిక కావడం పట్ల శర్వాణీ విద్యాలయం వ్యవస్థాపకులు,రాష్ట్ర కళింగ వైశ్య  కార్పొరేషన్ చైర్మన్  అంధవరపు సూరిబాబు గురువారం అభినందనలు తెలియజేసారు.  

గత నెల 27 నుంచి ఈ నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిఎస్ఎ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తృతీయ స్థానం దక్కించుకుని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికకావడంతో దిబ్బ ప్రణయ్ ను విద్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో వ్యాపారవేత్త అంధవరపు సూరిబాబు, శర్వాణీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ ప్రణయ్ జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ప్రణయ్ ను ప్రోత్సహిస్తూ రూ2వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో శర్వాణీ విద్యాలయం ఉపాధ్యాయులు సాయిరాణి,బి.కిరణ్ కుమార్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Sub Editor

సెప్టెంబర్ 22,23 తేదీలలో ఎస్ఐ శారీరిక ధారుడ్య పరీక్షలు…!

Satyam NEWS

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

Bhavani

Leave a Comment