38.2 C
Hyderabad
April 29, 2024 20: 17 PM
Slider ముఖ్యంశాలు

ట్రాఫిక్ చలాన రాయితీ రాష్ట్రం అంతా అమలు

#telanganastatepolicelogo

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల పై ఇచ్చే రాయితీ ని ఇక రాష్ట్రమంతా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది .

మొదటిరోజైన మార్చి 1 వ తేదీన  హైదరాబాద్ లో   దాదాపు  5 లక్షల చలాన్ల ద్వారా 7 కోట్ల మేరకు ఆదాయం రావటంతో  వెంటనే దీనిని రాష్ట్ర మంత అమలు చేయాలని  నిర్ణయం తీసుకున్నారు . హైదరాబాద్ పరిధిలోనే 1.20 కోట్ల చలాన్లు పెండింగ్ లో వుండగా , రాష్ట్ర మంత మరో కోటికి పైగా చలాన్లు పెండింగ్ లో వున్నట్లు గుర్తించిన అధికారులు రాయితీ విధానాన్ని అంతటా అమలు చేయాలని విర్ణయించారు .  

2,3 చక్రాల వాహనాలకు 75 శాతం , ఆర్‌టి‌సి డ్రైవరులకు 70 శాతం , కార్లు , పెద్ద వాహనాలకు 50 శాతం  రాయితీతో ఇవ్వనుండగా , నో మాస్క్ కేసులలో 900 రూపాయలు  మాఫీ చేసి 100 రూపాయలు కడితే చాలని అధికారులు  సూచించారు .

పేద లు, మధ్య తరగతి ప్రజలు గత రెండు సంత్సరా లుగా కోవిడ్ వలన పడిన ఆర్థిక ఇబ్బందులని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాఋ.  మార్చ్ 31 వరకు తెలంగాణా  ఈ చాలన్ వెబ్సైట్ లో  ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు  అవకాశం కల్పించారు.

Related posts

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇద్దర్ని అరెస్టు చేసిన ED

Bhavani

రేపటి నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో స్పర్శదర్శనం

Satyam NEWS

అసలు నిజం

Satyam NEWS

Leave a Comment