నిత్యం ఎంతో మంది విజిటర్లతో బిజీగా ఉండే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జనతా కర్ఫ్యూను కచ్చితంగా పాటిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆయన అన్ని అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సెల్ఫ్ క్యారంటైన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశం మొత్తం జనతా బంద్ ను పాటిస్తున్నట్లే మంత్రి పువ్వాడ కూడా చేస్తున్నారు. ఉదయం నుంచి ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయన నియంత్రణ పాటిస్తున్నారు. కేవలం 14 గంటలు కాకుండా 24 గంటల పాటు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని సిఎం కేసీఆర్ చెప్పడంతో రేపు ఉదయం 7 గంటల వరకూ అధికార కార్యక్రమాలు లేకుండా మంత్రి పువ్వాడ చర్యలు తీసుకున్నారు.
previous post