దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కొల్లాపూర్ ప్రజలు నడుం బిగించారు. ఆదివారం దేశమంతటా పాటిస్తున్న జనతా కర్ఫ్యూలో కొల్లాపూర్ ప్రజలు భాగ్య స్వాములయ్యారు.
అటు షాపు యజమానులు సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఎవరి ఇళ్లకు వాళ్లు అంకితమయ్యారు. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు.
కొల్లా పూర్ సీఐ బి.వెంకట్ రెడ్డి కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లో ప్రాంతాలను అనుక్షణం పరిశీలిస్తున్నారు. ఎస్ ఐ లు ప్రత్యేక నిఘా ఉంచారు. పట్టణ కేంద్రంలో సిఐ వెంకట్ రెడ్డి మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మొత్తానికి సర్కిల్ పరిధిలోని ప్రజలు జనతా కర్ఫ్యూలో సంపూర్ణగా పాల్గొన్నారు.
అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు సైరన్ ఇస్తామన్నారు. కరోనా వైరస్ పై నిరంతరం సేవ చేస్తున్న వైద్యులకు, నర్సులకు చప్పట్లతో అభినందించాలన్నారు.
ఎస్సై మురళి గౌడ్ కొల్లాపూర్ ప్రాంతంలో తిరుగుతూ ద్విచక్ర వాహనాలపై కనిపించిన వ్యక్తులకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని, బయటికి రాకూడదని తెలిపారు.