39.2 C
Hyderabad
April 28, 2024 14: 30 PM
Slider నిజామాబాద్

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

#kamareddycollector

గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 4549 మంది గ్రూప్ 1 పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. పరీక్షల కోసం 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 3 వేల మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగతా అభ్యర్థులు కూడా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ తర్వాత అందులో ఉన్న సూచనలను చూసుకోవాలన్నారు. ఈ నెల 16 న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు ఉదయం 8:30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవడం వల అభ్యర్థులకు ఇబ్బందులు ఉండవన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గజిటెడ్ అధికారిని కూడా నియమించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 14 మంది వికలాంగులు గ్రూప్ 1 పరీక్ష రాయనున్నారని, వారికోసం అన్ని వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు.

అభ్యర్థులు తమవెంట బంగారం, ఇతర విలువైన వస్తువులు తెచ్చుకోవద్దని, ఒకవేళ తెచ్చుకుంటే వాటి బాధ్యత అభ్యర్థులదేనన్నారు. పరీక్ష కేంద్రంలోకి షూస్ వేసుకోకుండా రావాలని, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లకు అనుమతి లేదన్నారు. ప్రతి 24 మంది ఉన్న ఒక సెంటర్ కు ఒక ఇన్విజిలేటర్ ను నికేయమించడం జరిగిందని, 48 మంది ఉంటే ఇద్దరిని ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏవైనా సందేహాలు ఉంటే 9989215590 నంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Related posts

పేదల బస్తీల్లో ఇంటి వద్దకే పోషన్ అభియాన్

Satyam NEWS

ప్రాణం పోయినా గుడిసెలను ఖాళీ చెయ్యం

Satyam NEWS

ఇంటరాగేషన్: తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment