33.7 C
Hyderabad
April 29, 2024 23: 13 PM
Slider కడప

ట్రూ అప్ చార్జీలు రద్దు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తాం

#cpmkadapa

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ట్రూ అప్ చార్జీల పేరుతో వేసిన భారాన్ని తక్షణమే రద్దు చేయాలని,  లేకపోతే పోరాటాన్ని తీవ్రతం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామ మోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఐఎన్. సుబ్బమ్మ డిమాండ్ చేశారు. గురువారం నాడు కడప నగరంలోని విద్యుత్ భవన్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్కరణలు అమలు చేయడంలో పోటీపడుతోందని వారు విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం 2900 కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీలను గతంలో విద్యుత్ పంపిణీ సంస్థలు నిలుపుదల చేశారని,  వాటిని తిరిగి మళ్లీ వసూలు చేసే ప్రక్రియ ప్రారంభించడం దుర్మార్గమని వారు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే సామాన్య ప్రజల మీద పెట్రోలు,  డీజిల్,  గ్యాస్, బస్ చార్జీలను తదితర భారాలు మోపుతున్న ప్రభుత్వం మళ్లీ వరుసగా విద్యుత్  ట్రూ అప్ చార్జీల భారాన్ని వేయడం వల్ల సామాన్యుల బ్రతుకులు చిద్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రూ అప్ చార్జీల భారాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి 36 నెలల పాటు వినియోగదారుడు భరించాలని చెప్పడం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విధిస్తూ కార్పొరేట్ శక్తులకు విద్యుత్ రంగాన్ని కట్టబెట్టే చర్యలు వేగవంతం చేసిందన్నారు. దీన్ని నిలువరించేందుకు సిపిఎం పార్టీ ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు.

ట్రూ అప్ చార్జీలు రద్దు చేయకపోతే రానున్న కాలంలో అన్ని రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు సంసిద్ధమవుతామని వారు తెలిపారు. ఈ పోరాటాల్లో ప్రజలు తమతో కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ ధర్నా అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పాపిరెడ్డి, అన్వేష్, చంద్రారెడ్డి, ఓబులేసు, ఎమ్మార్ నాయక్,  వెంకటసుబ్బయ్య, రామయ్య, మహబూబ్ తార, షాకీర్, సిద్దయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పీఎం విశ్వ‌క‌ర్మ యోజ‌నతో కులవృత్తుల వారికి ఆర్థిక స్వావ‌లంబన‌

Satyam NEWS

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

Satyam NEWS

హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నిక కమిషనర్

Satyam NEWS

Leave a Comment