కిషోరి వికాస్ యోజన ద్వారా 6-18 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలు
సేవా భారతి స్వచ్ఛంద (NGO) సంస్థ సేవలు అనిర్వచనీయమని పలువురు వక్తలు కొనియాడారు. హైదారాబాద్ మహా నగరంలో 300 మురికివాడల్లో 7,000 మంది ఆడ పిల్లలకి కిశోరి వికాస్ యోజన పథకం ద్వారా విద్యా, వైద్యం, ఉపాధి తదితర అవకాశాలు కల్పిస్తున్నది. మహిళల సాధికారత దిశగా కృషి చేస్తున్న ఈ సంస్థకు హెల్త్ ఎడ్జి టెక్నాలజీస్ కంపెనీ అండగా నిలిచింది. హెల్త్ ఎడ్జ్ CSR నిధుల సహకారంతో 1,500 మంది బాలికలకు సాధికారత కల్పించేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 57 కేంద్రాలను దత్తత తీసుకున్నది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ… సేవా భారతి – ఎడ్జ్ సంస్థ ల సేవలను కొనియాడారు. సేవా భారతి అన్ని రంగాల్లో మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిగేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నదన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సేవా భారతి సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సంస్థ ప్రతినిధులు, హెల్త్ ఎడ్జ్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.