37.2 C
Hyderabad
April 30, 2024 11: 21 AM
Slider అనంతపురం

శరవేగంగా అనంతపురం టవర్‌క్లాక్‌ ఆర్‌ఓబీ నిర్మాణం

#MLA Ananta Venkatarami Reddy

అనంతపురం నగరంలోని టవర్‌క్లాక్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మార్చి నాటికి రెండు వైపులా బ్రిడ్జి పనులు పూర్తి చేసి వాహన రాకపోకలకు అనుమతి ఇచ్చేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్‌ఓబితో పాటు వెహికల్‌ అండర్‌ పాస్‌ పనులను అధికారులు, ఎస్‌ఆర్‌సీ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా బ్రిడ్జి కింది భాగంలో జరుగుతున్న పనులను చూశారు. వెహికల్‌ అండర్‌ పాస్‌ నిర్మాణం తర్వాత రాకపోకలు ఎలా ఉంటాయో పరిశీలించారు.

ఇప్పటికే బ్రిడ్జికి ఒకవైపు సర్వీస్‌ రోడ్డు పనులు జరిగాయని, మరోవైపు (శాంతి థియేటర్‌ వైపు) కూడా పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్‌సీ ప్రతినిధి అవినాష్‌కు సూచించారు. భూసేకరణ, పరిహారంకు సంబంధించి ఎంత వరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. మీరంతా ఎంత త్వరగా సహకరిస్తారో అంతే త్వరగా పనులు పూర్తవుతాయని సూచించారు. ప్రతి ఒక్కరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. ఇరువైపులా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే దుకాణదారులకు కూడా మేలు జరుగుతుందని తెలియజేశారు.

అందులో భాగంగా దుకాణాల ముందు పార్కింగ్‌కు స్థలం వదులుకోవాలని సూచించారు. ఆ తర్వాత బ్రిడ్జిపైకి వెళ్లి పనులు పరిశీలించారు. టేప్‌తో బ్రిడ్జి కొలతలు తీయించారు. గడ్డర్ల లాంచింగ్‌కు అనుమతులు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న వివరాలపై ఆరా తీశారు. రెండు బ్రిడ్జిలకు మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా బ్రిడ్జితో పాటు రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది మార్చి ఆఖరికి బ్రిడ్జిని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.

వారం అటో, ఇటో బ్రిడ్జి పనులు అయిపోతాయని అధికారులు, కాంట్రాక్టర్‌ చెబుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీలోపు స్టీల్, సిమెంట్‌ గడ్డర్ల లాంచింగ్‌ జరుగుతుందన్నారు. గతంలో ఎక్కడా ఇంత పెద్ద బ్రిడ్జిని ఇంత వేగంగా పూర్తి చేస్తున్న పరిస్థితి లేదని చెప్పారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, కాంట్రాక్టర్లు రాత్రిపగలు కష్టపడి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. గతంలో ఉన్న బ్రిడ్జి మొత్తం వెడల్పు 7.5 మీటర్లు ఉంటే ప్రస్తుతం ఒకవైపు బిడ్జి వెడల్పు మాత్రమే 9.5 మీటర్లు ఉందని చెప్పారు.

వెహికల్‌ అండర్‌ పాస్‌ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయన్నారు. సాధ్యమైనంత త్వరగా రహదారిని అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం ల్యాండ్‌ అక్విజేషన్‌కు పరిహారం అందిస్తామన్నారు. అందరూ సహకరిస్తే ఇంకా త్వరగా పనులు పూర్తవుతాయని తెలిపారు. నిత్యం పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, కాంట్రాక్ట్‌ ప్రతినిధులను అభినందించారు. ఎమ్మెల్యే అనంత వెంట 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్, వైసీపీ నగర అధ్యక్షుడు చింతాసోమశేఖరరెడ్డి ఉన్నారు.

Related posts

తాగి పోలీసుల్ని కొట్టిన హీరోయిన్ అరెస్ట్

Satyam NEWS

రోగులకు మందులు ఇచ్చేందుకు చేతులు రావా?

Satyam NEWS

హిందువుల ధర్మానికి చిహ్నం అయోధ్య రామమందిరం

Satyam NEWS

Leave a Comment