29.7 C
Hyderabad
May 3, 2024 05: 22 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి నియోజకవర్గంలో అవినీతి పాలనను అంతం చేయాలి

#congress

వనపర్తి నియోజకవర్గంలో అవినీతి పాలనను అంతం చేసేందుకు ముందుకు వచ్చిన తనకు ప్రతి ఒక్కరు ఓటు వేసి దీవించాలని, మీ ఓట్లతో అధికారంలోకి వస్తే మీకోసం పెద్ద జీతగాడిలా పనిచేస్తానని వనపర్తి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు తూడి మెఘా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 500 మందికి పైగా  బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు మేఘారెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి  కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి వారిని సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు లక్ష్మీ మంజుల, చంద్రశేఖర్ రెడ్డి లు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతిని అంతం చేయాలని   పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. కొల్లాపూర్ 2009 తొమ్మిదిలో డిపాజిట్ రాని వ్యక్తి నేడు వనపర్తిలో నాకంటే పెద్ద నాయకుడు లేడంటూ చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 2014 ప్రచారంలో  కాంగ్రెస్, టిడిపిలో ఉన్న నాయకులకు ఓటు వేస్తే ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. గత పదేళ్ల కాలంగా వనపర్తిలో జరుగుతున్న అవినీతిపై ఏనాడు ఒకరోజు మాట్లాడని నాయకుడు నేడు వారి సరసన చేరి రాజకీయాలు చేయడంలో  ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.

సీనియర్  నాయకులు వెంకటంపల్లి, తిరుమలయ్యపల్లి, మామిడిమాడ, ఖిల్లా ఘనపురం గ్రామాలకు చెందిన పలువురు వార్డు మెంబర్లు బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, ముందర తండా సర్పంచ్ రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి తేనేటి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్,

సింగల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యశిలా రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ , ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, లక్కాకుల సతీష్, ఖిల్లా గణపురం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వివిధ పార్టీల నాయకులు పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సిబిఐటి మెకానికల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS

సిబ్బంది ఆర్ధిక అవసరాలను తీర్చేందుకే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ

Satyam NEWS

టీడీపీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికే ఫేక్ వీడియోలు

Satyam NEWS

Leave a Comment