29.7 C
Hyderabad
May 3, 2024 03: 27 AM
Slider ప్రత్యేకం

Thank God: కులం రంగు పులిమే అవకాశం రాలేదు

#SupremeCourtOfIndia

ఎవరు చేశారో ఏమో తెలియదు కానీ పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన పిటీషన్లు విచారించే సుప్రీంకోర్టు బెంచ్ మార్పించి రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం నెత్తిన పాలుపోశారు. ఇదే తీర్పును ముందుగా కేసును కేటాయించిన బెంచ్ ఇచ్చి ఉంటే కచ్చితంగా దానికి కులం రంగు పులిమేవారు.

ఇప్పటికే కులం రంగు పులిమి కొందరు చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది నమ్ముతున్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ముందుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు బెంచ్ కి సుప్రీంకోర్టు రిజిస్ట్రారు కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ తో బాటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు కూడా పలు పిటిషన్లను  సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నీ ఒకే బెంచ్ కి కేటాయించారు. అయితే ఇలా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఒకరికి న్యాయమూర్తి వద్ద గతంలో పని చేసిన అనుభవం ఉంది.

దాంతో సదరు పిటిషనర్ ఆ న్యాయమూర్తి కేసు విచారించేందుకు అభ్యంతరం చెప్పే అవకాశం ఏర్పడింది. ఇలా కేసు వచ్చి ఉంటే ఆ న్యాయమూర్తి ‘‘నాట్ బి ఫోర్ మి’’ (నేను ఈ కేసు విచారించలేను) అని చెప్పే అవకాశం ఉండేది. అయితే ఇది కాలయాపన జరిగేందుకు దారితీసేది.

అప్పటికే నామినేషన్ల సమయం వచ్చేసినందున కేసు విచారణలో ఇక తదుపరి జాప్యం జరిగేందుకు వీలులేదు. దాంతో రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని కేసును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి కేటాయించారు.

బెంచ్ మారే సరికి పెరిగిన ఆశలు

కేసు బెంచ్ మారేసరికి చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ వాదనకు అనుకూలంగా ఉన్న వారు ఆశలు పెంచుకున్నారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసులో తమకు అనుకూలంగా తీర్పు చెబుతారని భావించారు.

జస్టిస్ లావు నాగేశ్వరరావు గతంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక ఎన్నికల పిటిషన్లు విచారించినపుడు ఎన్నికలు జరిపేలాగానే తీర్పు చెప్పారు. ఈ దృష్ట్యా బెంచ్ మారగానే రాష్ట్ర ప్రభుత్వ వాదన ను సమర్థించేవారిలో ఆశలు పుట్టుకొచ్చాయి.

అయితే వారు ఊహించని విధంగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేసు వాదనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ నిర్వహణ తీరుతెన్నులపైనా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

ఇగో (అహం) తగ్గించుకోవాలని హితవు కూడా పలికారు. ఉద్యోగ సంఘాలు ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నీ మొదట కేసు కేటాయించిన బెంచ్ చేసి ఉన్నట్టయితే కులం రంగు పులిమి ఉండేవారు.

న్యాయమూర్తులకు కులం ఆపాదించడం అనే దుష్ట సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉండటంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నా సంబంధిత ప్రచారాలను చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన తీర్పు పై కూడా కుల దుమారం రేగి ఉండేదే కానీ ఎవరు చేశారో, ఎవరు చేయించారో తెలియదు కానీ న్యాయస్థానాలకు న్యాయం చేశారు.

Related posts

[Over The Counter] Buy Volume Pills Best Otc Sex Pill

Bhavani

“ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ గంగపట్నం శ్రీధర్ సొంతం!!

Satyam NEWS

సీనియర్ నేత బొడ్డు అంజయ్య మృతి

Murali Krishna

Leave a Comment