39.2 C
Hyderabad
May 3, 2024 14: 26 PM
Slider నిజామాబాద్

డబుల్ ఇళ్ల పేరుతో డ్రామాలు చేస్తున్న షబ్బీర్ అలీ

#gampagovardhan

డబుల్ ఇళ్ల పేరుతో షబ్బీర్ అలీ డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ షబ్బీర్ అలిపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సవాల్ మేరకు నేడు ఉదయం 10 గంటలకు డబుల్ ఇళ్ల పరిశీలనకు వస్తానని వెళ్లిన షబ్బీర్ అలీ గంప గోవర్ధన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై గంప గోవర్ధన్ స్పందించారు. సాయంత్రం పొద్దుపోయాక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 1715 ఇండ్లు మంజూరయ్యాయని, అందులో 720 ఇల్లు పూర్తి కావచ్చాయన్నారు. రాజీవ్ నగర్ కాలనిలో 300, రామేశ్వర్ పల్లి పరిధిలో 200, ఇల్చిపూర్ శివారులో 50, టేక్రియాల్ వద్ద 50, దేవునిపల్లిలో 120 ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇందులో ఇన్ ఫ్రా ట్రక్చర్ కోసం నాలుగైదు నెలల క్రితమే నిధులు మంజూరయ్యాయన్నారు.

వారం 10 రోజుల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం టేక్రియాల్ శివారులో నిర్మిస్తున్న డబుల్ ఇళ్లను మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించి నాణ్యత లేవని, కూలిపోయే దశలో ఉన్నాయని, లబ్ధిదారులు ఈ ఇళ్లలోకి పోవద్దని చెప్తే నాణ్యత పరిశీలనపై ప్రభుత్వ ఇంజనీర్లను తీసుకువచ్చి పరిశీలిద్దమని, షబ్బీర్ అలీ కూడా ఇంజనీర్లను తీసుకురావాలని తాను సవాల్ చేశానన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను బిజీగా ఉన్నానని తెలిసి కూడా కనీస సమయం ఇవ్వకుండా ఈరోజు 10 గంటలకు వస్తున్నానని చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద డ్రామా షురూ చేశాడని పేర్కొన్నారు. నిజంగా ఛాలెంజ్ స్వీకరించే వ్యక్తివే అయితే రెండు రోజులు గడువు ఇవ్వాల్సిందన్నారు. నీలాగా తాను ఖాళీగా లేనని, నీ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ నువ్వు ఖాళీగా ఉన్నావని, 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల్లో తాను బిజిగా ఉన్నానని చెప్పారు.

గత 2018 ఎన్నికల్లో కూడా ఇలాగే గాంధీ గంజ్ వద్దకు రావాలని సవాల్ విసిరితే తాను వచ్చి వెళ్లిన రెండు గంటల తర్వాత వచ్చి డ్రామాలు చేశాడని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు అదే డ్రామాలు, షోలు చేస్తున్నాడని మండిపడ్డారు. నీ జీవితం మొత్తం డ్రామాలు, షోలు చేయడమేనా షబ్బీర్ అలీ అని ఎద్దేవా చేశారు. కామారెడ్డి ప్రజలు నిన్ను ఎందుకు ఓడిస్తున్నారో తెలుసుకోవా..?

పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తివి.. జాతీయ పార్టీ నాయకుడిగా ఉన్నావు.. బాధ్యతగా ఉండలేవ అని నిలదీశారు. 50 ఏళ్ళు మన్నికగా ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపడితే ఇల్లు కూలిపోతాయి అంటావా అని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే ఇంజనీర్లను తీసుకురా.. నేను కూడా ఇంజనీర్లను తెస్తా.. వాళ్ళు కూలిపోతాయి అంటే ముక్కు నేలకు రాస్తా అని మరోసారి సవాల్ విసిరారు.

టేక్రియాల్ వద్ద కట్టిన ఇల్లు మూడేళ్ళ క్రితం నిర్మించినవని, ఇంకా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రిగా చేసిన వ్యక్తికి నాణ్యత విషయం మెస్త్రీలకు తెలుస్తుందో, ఇంజనీర్లకు తెలుస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. మెస్త్రీలను నాణ్యత పరిశీలనకు తీసుకు వెళ్ళడానికి సిగ్గు, లజ్జ లేదా.. ఇదేనా నీ నీచ రాజకీయం అని ప్రశ్నించారు. ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాల్లో తాను బిజీగా ఉంటానని, 22 తర్వాత తేదీ చెప్తే ఆ తేదీన తాను ఇంజనీర్లను తీసుకుని వస్తానని, నాణ్యత సంగతి తెలుద్దామని, నీలాగా తాను పారిపోయే వ్యక్తిని కాదని తెలిపారు.

డబుల్ ఇళ్లను తాను కార్యకర్తలకు ఇచ్చానని తనపై ఆరోపించారని, కలెక్టర్, చైర్మన్, అధికారుల సమక్షంలో ఎక్కడిక్కడ గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే డ్రా పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. టేక్రియాల్ గ్రామంలో 130 దరఖాస్తులు వచ్చాయని, కట్టిన ఇండ్లు 50 అయితే 49 ఇండ్లకు డ్రా పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, మరొక ఇల్లు సరెండర్ నక్సలైట్ కెప్టెన్ శ్రీనివాస్ కు కలెక్టర్ తన ప్రత్యేక అధికారులతో కేటాయించారన్నారు.

49 మంది లబ్దిదారుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మద్దికుంట ప్రవళిక, కడమంచి భైరవ, పురం సావిత్రి, సుంకరి శోభ, ఆర్. స్వప్న, రెహానా బేగం, మద్దికుంట శ్యామల, కడమంచి సాయిలు, సుజాత ఉన్నారన్నారు. తాను కార్యకర్తలకు ఇళ్లను ఇచ్చి ఉంటే వీరికి ఇల్లు వచ్చేవా.. దీనికి షబ్బీర్ అలీ సమాధానం చెప్పాలన్నారు. మీడియా ముందు షో చేసి అధిష్టానాన్ని నమ్మించడానికి షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నాడన్నారు.

ప్రతిసారి ఒడిపోతున్నానని, గెలిచే వారికే టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పడంతో రేవంత్ రెడ్డితో అంట కాస్తున్నారని అన్నారు. జిల్లాలోని మీ నాయకులే నీపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని గుర్తు చేశారు. 30 శాతం కమిషన్ తీసుకున్నానని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను, నా తమ్ముడు, నా వెనకున్న నాయకులు చేసిన తప్పులు క్షమించి ఈసారి గెలిపించాలని ప్రజలను వేడుకోవాలని సూచించారు. అంతేకాని నా నిజాయితీని శంకించవద్దన్నారు.

Related posts

ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

Satyam NEWS

ఢిల్లీ ఫైర్: ఇప్పటికి 35 మంది మృతి

Satyam NEWS

శ్రీ శుభకృతి కృతి

Satyam NEWS

Leave a Comment