40.2 C
Hyderabad
May 2, 2024 16: 13 PM
Slider కరీంనగర్

రైతులకు సంపూర్ణంగా ధాన్యం డబ్బుల బదిలీ

#Minister Gangula Kamalakar

నేటి వరకు ధాన్యం కొనుగోలు చేసి ఓపిఎంఎస్ లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులను బదిలీ చేశామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేడు 1500 కోట్లను ఏకమత్తంగా విధాలు చేయడంతో ఇప్పటివరకు 11444 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. ఓపి ఎమ్మెస్ లో నమోదైన వెంటనే డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నేటి వరకు 11 లక్షల పదివేల మంది రైతుల నుండి 65.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిందని కేవలం ఒక 100 సెంటర్లో మాత్రమే అక్కడక్కడ కొనుగోలు జరుగుతున్నాయి అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం గా పని చేస్తున్నానడానికి ఈ ధాన్యం సేకరణ నిదర్శనం అన్నారు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కెసిఆర్ ఆదేశంతో కొనుగోలు చేపట్టామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Related posts

ద్వారకా తిరుమల అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం

Satyam NEWS

త్వరలో పరిపాలనా రాజధానిగా విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డి

Sub Editor

కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ దురుసు ప్రవర్తన

Satyam NEWS

Leave a Comment