33.7 C
Hyderabad
April 29, 2024 00: 01 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ పై నేనే పోటీ చేస్తా: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

#shabberali

సీఎం కేసీఆర్ పై తానే పోటీలో ఉంటానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా రిలీజ్ ఆయిన నుంచి కేసీఆర్ పై షబ్బీర్ అలీ పోటీకి వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలపై షబ్బీర్ అలీ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం కేసీఆర్ కనుసన్నల్లో బిఆర్ఎస్ వర్గాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారమని కొట్టిపారేశారు.  కేసీఆర్ పోటీ చేస్తున్నాడని తెలిసిన మొదటి రోజున తాను స్వాగతం చెప్పానని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుండైనా పోటీ చేయవచ్చని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు కుట్రలు కుతంత్రాలు తెలియవన్నారు.

ఇంతకాలం తాను నిజాయితీగా రాజకీయాలు చేశానని, ఇక ముందు కూడా అంతే నిజాయితీగా ఉంటానని తెలిపారు.  కేసీఆర్ కు ఇంకోసారి స్వాగతం పలుకుతున్నానని, రా.. కామారెడ్డికి. ఇద్దరం పోటీలో ఉందామని పిలుపునిచ్చారు. ఇద్దరం ప్రజాక్షేత్రంలో కలబడదామని, ఎవరి నిజాయితీ ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అంతేకానీ అధర్మయుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు నిన్ను క్షమించరని పేర్కొన్నారు. ‘నేను కామారెడ్డి బిడ్డను.. నా పుట్టుక మరణం కామారెడ్డితోనే.. ఇదివరకే చెప్పాను.. నేను ఈ మట్టి మనిషిని మరి నీవు రాజకీయ ప్రయోజనాల కోసం గజ్వేల్ నుండి ఇక్కడికి వస్తున్నావు. నేను కామారెడ్డిలో ఉండను గజ్వేల్ ప్రజలే సమస్తమని మొన్ననే బహిరంగంగా మాట్లాడినవ్. దీనికి నువ్వు కామారెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. కేసీఆర్.. నీ రాజకీయ సమాధికి నీవే కామారెడ్డి వైపు అడుగులు వేస్తున్నావ్ ఇది నా మాట కాదు ఇక్కడి నా ప్రజల మాట అని తెలిపారు.

Related posts

పారిశుధ్య కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు

Satyam NEWS

మరో కాంతారా కన్నడ సినీ ప్రియులకు మరో విందు

Bhavani

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

Leave a Comment