30.7 C
Hyderabad
April 29, 2024 04: 40 AM
Slider సినిమా

మరో కాంతారా కన్నడ సినీ ప్రియులకు మరో విందు

#Baby

ఏ సినిమా ఎప్పుడు ఎందుకు ఎలా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. తెలుగులో అలా ఈ మధ్య ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న మూవీ ‘బేబీ’. మూడు నాలుగు చిత్రాలు తీసిన డైరెక్టర్, పెద్దగా అనుభవం లేని హీరోహీరోయిన్స్.. అయితేనేం హిట్ కొట్టారు.ఇలా టాలీవుడ్‌లో ‘బేబీ’ హవా నడుస్తుంటే.. కన్నడలో ఓ చిన్న సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. అదేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?…. రండి చూసేద్దాం…

కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అన్ని భాషల సినీపరిశ్రమలోనూ ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’.

కన్నడ ఇండస్ట్రీకి కాస్త ఊపు తీసుకొచ్చింది.’కేజీఎఫ్ 2′, ‘చార్లీ’, ‘కాంతార’ తర్వాత శాండల్‌వుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటీ ఆ ఇండస్ట్రీకి పడేలేదు. ఇప్పుడు దాన్ని ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’.. కొంతలో కొంత కవర్ చేసింది అనుకోవచ్చు.

ఈ ఏడాది కన్నడలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. జనవరిలో దర్శన్ ‘క్రాంతి’, మార్చిలో ఉపేంద్ర ‘కబ్జ’ భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడ్డాయి. ఐపీఎల్, శాసనసభ ఎన్నికల వల్ల శాండల్‌వుడ్ బాక్సాఫీస్ డల్ అయిపోయింది.

స్టార్ హీరోలు ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశాన్ని ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ కరెక్ట్‌గా క్యాచ్ చేసి, హిట్ అయింది.గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో అంతగా ఏముందా అంటే.. యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ. హాస్టల్ రూంలో ఉండే స్టూడెంట్స్‌లో ఒకడికి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది.

పరీక్షలు ఉన్నాయని ఫ్రెండ్స్ వద్దంటారు. ఓ రోజు హఠాత్తుగా వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లే కారణమని, సదరు వార్డెన్ ఈ ఐదుగురు అబ‍్బాయిల పేర్లు ఓ నోట్‌లో రాసి ఉంటాడు.

ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఈ కుర్రాళ్లు, ఓ సీనియర్‌ని హెల్ప్ అడుగుతారు. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంతకీ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ అంటే ఏంటో చెప్పలేదు కదూ.. దానర్థం ‘హాస్టల్ పిల్లలు కోరుకుంటే’. ప్రస్తుతం కన్నడలో మాత్రమే ఉన్న త్వరలో తెలుగులో రిలీజైన ఆశ్చర‍్య పడాల్సిన పనిలేదు.

హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. ఇందులో అతను చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. అలానే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో మెరిసి మెప్పించారు. ‘కాంతార’కు సంగీతమందించిన అజనీష్ లోక్‪‌నాథ్.. ఈ చిన్న సినిమాని తన మ్యూజిక్ తో మరో లెవల్‌కి తీసుకెళ్లాడు.

కథ.. స్క్రీన్‌ ప్లే యూనివర్శిల్ సబ్జెక్ట్‌…. ఏ భాషలో అయినా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కనుక త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంతార మాదిరిగా ఈ సినిమా డబ్బింగ్ అయ్యి అన్ని భాషల్లో వినోదాన్ని పంచుతుందా? లేదంటే రీమేక్ అవ్వబోతుందా? అనేది చూడాలి. మొత్తానికి కన్నడ సినిమా పరిశ్రమలో మరో కాంతార అంటూ ఈ సినిమా గురించి పాన్ ఇండియా రేంజ్‌ లో ప్రచారం జరుగుతోంది.

Related posts

సీఎం జగన్ పర్యటన సందర్భంగా సభా స్థలి ఖరారు

Satyam NEWS

మురికి వాడ‌లకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ‌రాలు

Satyam NEWS

పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పేట వేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment