40.2 C
Hyderabad
April 29, 2024 16: 29 PM
Slider ప్రత్యేకం

హిందూత్వాన్ని అవమనపరుస్తున్న షర్మిల

#YS Sharmila

వై ఎస్ షర్మిల కార్యాలయమే ఓ పెద్ద క్రిస్టియన్ ఆక్టివిటీ కేంద్రం అని విశ్వహిందూ పరిషత్ (VHP) బాద్యుడు పగుడాకుల బాలస్వామి అన్నారు. ఆమె భర్త బ్రదర్ అనిల్ ఓ మత మార్పిడి వ్యవస్థకు అధినేత. వాళ్ల వ్యవహారం అంతా హిందూ వ్యతిరేకతే అని ఆయన తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి చోట హిందూత్వాన్ని అవమాన పరుస్తూ.. అవహేళన చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో ప్రజలకు అంతా అన్యాయం జరిగిపోయింది అంటూ.. తాను వచ్చి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తానంటూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు అని ఆయన అన్నారు.

అయితే రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివి..ఎవరి జెండా వారిది..ఎవరి విధానాలు వారివి. కానీ ఇక్కడ రాజకీయాలకంటే ఎక్కువగా మత విశ్వాసాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణలో హిందుత్వాన్ని దెబ్బతీసేటందుకోసం వైఎస్ఆర్ టీపీ బలంగానే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. మత మార్పిడి ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే బోనాల పండుగ సందర్భంగా ఇటీవల బోనం ఎత్తుకొని దేవతకు సమర్పించకుండానే షర్మిల వెనుతిరిగారు. హిందూ దేవతలకు మొక్కడం ఇష్టం లేక బోనం సమర్పించకుండానే వెళ్ళిపోయారు. ఇదంతా సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన విషయమే. ఖమ్మం జిల్లాలో తన పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు భూమి పూజ ప్రారంభించిన సందర్భంలో హిందుత్వంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు షర్మిల.

సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికేందుకు పూర్ణకుంభం తీసుకువచ్చిన వేద పండితులను.. బొట్టు పెట్టి ఆహ్వానించేందుకు వచ్చిన మహిళల పట్ల షర్మిల ఛీదరించుకున్నారని ఆయన అన్నారు.అంతకుమించి హిందుత్వాన్ని అసహ్యించుకున్నారు.. అవహేళన చేశారు. అడుగడుగునా హిందూ ద్వేషం నింపుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. తెలంగాణ ప్రజలను ఉద్ధరించడం ఏమిటో గాని, ఆంధ్రప్రదేశ్ మాదిరి తెలంగాణలో కూడా క్రైస్తవ మతమార్పిడిలను ప్రోత్సహించకుంటే చాలునని ఆయన అన్నారు.

తెలంగాణ లో క్రిస్టియన్ ఆక్టివిటీ పెంచేందుకే ఆ పార్టీ ఇక్కడ పురుడు పోసుకున్నట్టు అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే తెలంగాణ పోరాటాల గడ్డ.. వెన్ను చూపని వీరులకు కొదవలేని ప్రాంతం ఇది. ప్రధాన జాతీయ పార్టీలు.. స్థానిక పార్టీలు అనేకం పేదల కోసం పోరాడుతూనే ఉన్నాయి. కానీ కుటుంబ తగాదాల వల్లనో.. మరింకేదో కారణం చేతనో గాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి, తల్లి.. షర్మిల భర్త ఇక్కడ వచ్చి క్రైస్తవ కార్యకలాపాలు విపరీతంగా పెంచుతున్నారు. ఈ ఆక్టివిటీని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి హిందువుపై ఉందని గుర్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

రాజకీయాలు వేరు.. మతాలు వేరు. కానీ మతమార్పిడి ఎజెండాగానే వీరి పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే పూర్ణకుంభాన్ని తోసివేస్తూ.. హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి సాదరంగా ఆహ్వానించే మహిళలను చిదరించుకోవడం షర్మిల మతాహంకారాన్ని గుర్తుచేస్తుంది. ఏది ఏమైనా క్రైస్తవ మిషనరీల ఆగడాలను ఎదుర్కొని, హిందుత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఉండాల్సిందేనని ఆయన తెలిపారు.

Related posts

రాహుల్ గాంధీ పట్ల పోలీసుల ప్రవర్తన సరికాదు

Satyam NEWS

హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అంద‌జేత

Satyam NEWS

ఉప్పొంగిన ఉత్సాహం.. వాడ‌వాడ‌లా ప‌తాక సంబ‌రం

Satyam NEWS

Leave a Comment