ఆపదలో ఉన్న మహిళలను, విద్యార్థినులను ఆదుకోవడానికి పోలీసులు నిర్దేశించిన డయల్ 100 పై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్ ఉపక్రమించారు. సుబేదారి పోలీసుల అధ్వర్యంలో స్థానిక విష్ణు ప్రియ గార్డెన్స్ లో పోలీస్ డయల్ 100 పై అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు.
స్థానిక పాఠశాలలు, కళాశాల లకు విద్యార్థినులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికే డయల్ 100 ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. ఏ సమయంలోనైనా పోలీసులు వచ్చి మహిళలను, ఆపదలో ఉన్నవారిని కాపాడతారని ఆయన తెలిపారు.