34.2 C
Hyderabad
May 10, 2024 11: 29 AM
Slider ప్రత్యేకం

వాహనదారులకు షాక్

#vehicles

ఆంధ్రప్ర‌దేశ్ లోని వాహ‌నదారుల‌కు రాష్ట్ర ర‌వాణా శాఖ షాక్ ఇచ్చింది. రీ– రిజిస్ట్రేషన్ ఫీజుల‌ను భారీగా పెంచుతూ ఏపీ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఆదేశాల‌ను సైతం జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ర‌వాణా, ర‌వాణాయేత‌ర వాహ‌నాలకు వ‌ర్తించ‌నుంది.

రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన వాహ‌నాల రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫీజుల‌ను రవాణా శాఖ‌ భారీగా పెంచింది. రీ– రిజిస్ట్రేషన్ కు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వాహ‌నాల ఫిట్ నెస్ ప‌రీక్ష చేసేంద‌కు ఫీజు వ‌సూల్ చేయ‌బోతుంది. దీంతో వాహ‌నాదారుల‌పై భారం ప‌డ‌నుంది. తాజాగా ర‌వాణా శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌లు కానున్నాయి. పెరిగిన‌ రీ– రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి.

బైక్ రీ – రిజిస్ట్రేషన్ కు రూ. 1000, ఆటో రూ. 2,500, కార్లు, జీపుల రీ – రిజిస్ట్రేషన్ కు రూ. 5,000 వ‌ర‌కు పెరిగింది. అలాగే దిగుమ‌తి చేసుకున్న కార్ల రీ – రిజిస్ట్రేషన్ కు రూ. 40 వేల వ‌ర‌కు రవాణా శాఖ పెంచింది.

Related posts

విశాఖ ఉక్కును వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ

Satyam NEWS

ఇసుక రీచ్ లు అర్హమైన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి

Satyam NEWS

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళి

Satyam NEWS

Leave a Comment