29.7 C
Hyderabad
April 29, 2024 09: 36 AM
Slider జాతీయం

శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

#ShraddhaWalker

దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధా వాకర్ శ్రద్ధా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. ప్రేమించిన వ్యక్తే అత్యంత కిరాతకంగా శద్ధా ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లా (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ముక్కలు ముక్కలుగా చేసిన శరీర భాగాలను వేరు వేరు ప్రదేశాలలో పడేయడంతో వాటి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇంకా శ్రద్ధా తల, మొండెం లభ్యం కాలేదు. మిగిలిన మృతదేహాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. దొరికిన ఎముకలు శరీరభాగాలు శద్ధావేనా కాదా అనేది తేల్చడానికి వాటికి DNA పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎముకలను త్వరలో ఫోరెన్సిక్ పరీక్షకు పంపనున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు ఇంకా సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు నిందితుడిని విచారిస్తున్నప్పుడు అతను నవ్వుతూనే ఉన్నాడు. ఏ మాత్రం విచారం వ్యక్తం చేయడం లేదు. తన అదృష్టం బాగోలేదని అందుకే పోలీసులకు చిక్కానని అతను చెబుతున్నాడు. శ్రద్ధా ను హత్య చేసిన తర్వాత తన రక్షణ కోసమే శరీరాన్ని ఖండఖండాలుగా నరికి వేరు వేరు చోట్ల పడేసినట్లు అతడు చెబుతున్నాడు. నిందితుడు బీబీఏతో పాటు అనేక కోర్సులు చేసి గుర్గావ్‌లో పనిచేసేవాడు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత నిందితుడు మొబైల్ హ్యాండ్‌సెట్‌ను మార్చాడు, కానీ అదే నంబర్ ఉపయోగించడంతో అతడు సులభంగా పట్టుబడ్డాడు. మరోవైపు, సెప్టెంబర్ 15న తన కూతురు కనిపించడం లేదని శ్రద్ధా తండ్రికి తెలిసింది. ఆ తర్వాత శ్రద్ధ తండ్రి వికాస్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం ముంబై పోలీసులు నవంబర్ 10న ఢిల్లీ పోలీసుల వద్దకు వచ్చారు. ఇందులో ముంబై పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం బయటపడుతోంది. శ్రద్ధ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లా (28) దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్ (26) ను చంపి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఆ ముక్కలను కడిగి పాలిథిన్‌లో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాడు. మృతదేహాన్ని పిట్టు సంచిలో ఉంచి అడవిలో పడేసేవాడు. ఇలా దాదాపు 22 రోజుల పాటు మృతదేహం ముక్కలను బయటకు తీసుకువెళ్లి అతడు పారేస్తూ వచ్చాడు. 22 రోజుల పాటు మృతదేహంతో అతను ఇంట్లోనే ఉన్నాడు. ఆ ముక్కలను మెహ్రౌలీ అడవుల్లో విసిరేందుకు రోజూ రాత్రి రెండు గంటలకు వెళ్లేవాడు. దాదాపు ఆరు నెలల తర్వాత నిందితుడిని మెహ్రౌలీ పోలీసులు అరెస్టు చేయగా, అతడు ఈ సంచలన విషయాన్ని వెల్లడించాడు. అఫ్తాబ్ తరచూ ఆమెను కొట్టేవాడట. అయితే వాడి చర్యలను చాలా సార్లు ఆమె పట్టించుకోలేదు. గత మూడు సంవత్సరాల రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవని పోలీసు విచారణలో తేలింది. అఫ్తాబ్ ఆమెను కొట్టేవాడు. అయినప్పటికీ, అఫ్తాబ్ చేష్టలను శ్రద్ధా పట్టించుకోలేదు. శ్రద్ధా ముంబైలోని మలాడ్‌లో ఉంటూ కాల్ సెంటర్‌లో పనిచేసింది. అఫ్తాబ్ అమీన్ పూనావాలా కూడా ముంబై నివాసి. డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు.

ఇద్దరూ లివ్-ఇన్‌లో జీవించడం ప్రారంభించారు. ఈ సంబంధం గురించి శ్రద్ధా కుటుంబానికి తెలియడంతో, వారు అఫ్తాబ్‌ను విడిచిపెట్టమని శ్రద్ధను కోరారు. కానీ ఆమె అంగీకరించలేదు. హిమాచల్, ఉత్తరాఖండ్‌లను సందర్శించే సాకుతో శ్రద్ధా అఫ్తాబ్‌తో కలిసి ముంబై వెళ్లిపోయింది. ఇద్దరూ రిషికేశ్‌ను సందర్శించడానికి వెళ్లి తిరిగి వచ్చి ఢిల్లీలో నివసించడం ప్రారంభించారు. ఇక్కడ అతను మెహ్రౌలీలోని ఛతర్‌పూర్‌లో అద్దెకు గది తీసుకున్నాడు. ఈ విషయం శ్రద్ధ తండ్రికి తెలియడంతో ఆమెతో మాట్లాడడం మానేశాడు. కొన్నిసార్లు శ్రద్ధా తన తల్లితో మాట్లాడేది. మే 18న అఫ్తాబ్, శ్రద్ధా మధ్య గొడవ జరిగింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం అఫ్తాబ్‌కు శ్రద్ధ పెళ్లి ప్రపోజ్ చేసింది.

అఫ్తాబ్‌కు పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అఫ్తాబ్ ఒక చేత్తో శ్రద్ధ నోటిని నొక్కాడు. శ్రద్ధా కేకలు వేయడంతో నిందితుడు మరో చేత్తో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. 35 ముక్కలుగా నరికిన మొత్తం మృతదేహాన్ని పారేసిన తర్వాత అఫ్తాబ్ ఫ్లాట్ మార్చాడు. విచారణలో మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా మొబైల్ చివరి లొకేషన్ దొరికింది. శ్రద్ధా ఖాతా నుంచి 55 వేల రూపాయలు డ్రా అయినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్‌కు నార్కో టెస్టు కోసం పోలీసులు కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు.

Related posts

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

అట్టహాసంగా ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

Satyam NEWS

ఆక‌ట్టుకుంటున్న ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైల‌ర్‌

Satyam NEWS

Leave a Comment