26.7 C
Hyderabad
May 3, 2024 08: 08 AM
Slider శ్రీకాకుళం

నాటుసారా పై అవగాహన కు షార్ట్ ఫిలిం

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ దిశా యాప్ అవగాహనా సదస్సులో భాగంగా సారా మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను 60 సెకండ్స్ నిడివి షార్ట్ ఫిలిం పోటీ నిర్వహించారు.

సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి ఆర్ రాధిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో 12 షార్ట్ ఫిలిం రాగా.. అందులో మజ్ను క్రియేషన్స్ వారి డోలు అప్పన్న టీం మొదటి విజేతగా నిలిచింది. ఈ టీమ్ కు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక పదివేల రూపాయలు నగదు బహుమతిని అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ షార్ట్ ఫిలిం దర్శకుడు డోల ఆశారాజు చిన్న వయసులోనే మంచి సామాజిక స్పృహ గల వ్యక్తి అని తెలిపారు. నాటుసారా నిర్మూలనపై లఘు చిత్రాన్ని నిర్మించడం హర్షణీయం అని అన్నారు. తండ్రి సీనియర్ జర్నలిస్టు డోల అప్పన్న అందించిన ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యం అయిందని తెలిపారు. తన అభిరుచికి తగిన రంగములలో రాణించడం అభినందనీయమని మంత్రి తెలియజేశారు.

Related posts

రహస్యంగా సాగుతున్న ఫ్యాక్షన్ పాలన ఇది

Satyam NEWS

మాస్కులను పంపిణీ చేసిన ఎసై కొంపల్లి మురళి గౌడ్

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Bhavani

Leave a Comment