40.2 C
Hyderabad
May 2, 2024 15: 25 PM
Slider మహబూబ్ నగర్

నివాస గృహాల మధ్య వైన్ షాపు: మందు బాబులతో సమస్య

#wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లభనగర్ 33వ వార్డులో ఉన్న వైన్ షాప్  నివాసగృహాల మధ్యన ఉన్నందుకు తొలగించాలని టీఆర్ఎస్ నేత,మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్ వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు పిర్యాదు చేశారు. వైన్ షాపు వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు, మహిళలకు, పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థిని విద్యార్థులకు మద్యం బాబుల వల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. వైన్ షాప్ కు వచ్చే వారు వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలపడం వల్ల  మూత్ర విసర్జన కూడా కాలువల్లో చేయటం వలన నివసిస్తున్న ప్రజలు ఇంట్లో నుంచి బయటికి లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ వైన్ షాప్ ను కమర్షియల్ ప్రాంతాలలో  ఉంచుకుంటే బాగుంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్  వేణు గోపాల్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్ వెంట కాలనీ వాసులు  శ్రీమతి కే. వరలక్ష్మి, సుమిత్ర, భాను ప్రకాష్ ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

120 కోట్లతో 2వేల ఇళ్ళు

Satyam NEWS

కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బానిసల తాకిడి

Satyam NEWS

Leave a Comment