26.7 C
Hyderabad
May 3, 2024 10: 35 AM
Slider రంగారెడ్డి

ఘనంగా జరుగుతున్న సిబిఐటి శృతి 2023 వేడుకలు

#cbit

సిబిఐటి కళాశాల లో ఘనం గా శృతి 2023 కళాశాల వేడుకలు జరిగాయి. మొదటి రోజు కళాశాల విద్యార్థుల ఆక్టివిటీ క్లబ్స్ పెరేడ్ చూపరులను విశేషం గా ఆకాశర్షించింది.  కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. విద్యార్థుల వివిధ గాన, నాట్య పోటీలలో పాల్గొన్నారు. నేడు సిబిఐటి కళాశాల లో శృతి కళాశాల వార్షిక దినోత్సవ సందర్భం గా రెండవ రోజు క్రీడ దినోత్సవం ఎంతో వైభవం గా జరిగింది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న వివిధ క్రీడ విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. 

కనుల పండుగ గా సాగిన సాయంత్రం కార్యక్రమంలో ముఖ అతిధి గా అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు అక్షర్ అభ్యుదయ్, గౌరవ అతిథి గా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కె మనీష వేదిక ను అలంకరించారు. ఈ సందర్భంగా అక్షర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించడంలో మన అందరం ఎన్నో  అడ్డంకులను ఎదుర్కోవచ్చు.  శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. మీ గురువులను నమ్మండి. వారి సూచనలను అనుసరించండి అని అన్నారు.

కె మనీష మాట్లాడుతూ విజయం సాధించడానికి క్రమబద్ధమైన ప్రణాళిక అవసరం. క్రమమైన అభ్యాసం మరియు అంకితభావం మరింత ముఖ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి , శృతి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డి కృష్ణ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ రాజేశ్వరి,  మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.

Related posts

ఏపీ డిప్యూటీ స్పీకర్.. రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్

Satyam NEWS

తగ్గిన అడ్మిషన్స్

Bhavani

Leave a Comment