40.2 C
Hyderabad
April 29, 2024 15: 53 PM
Slider ముఖ్యంశాలు

ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్

#bandi

ఓరుగల్లు లో ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్…!

‘ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా… బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.‌ ఈ నెల 21 పాలమూరులో   టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల, ఆయా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నేతలను కాపాడుకునేందుకే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. లీకేజీ కేసులో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఓరుగల్లులో వేలాది మందితో బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన మార్చ్ లో వేలాది మంది నిరుద్యోగులు, కార్యకర్తలు హాజరయ్యారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికిపాటి మోహన్ రావు, మాజీ ఎంపీలు చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ

ఓరుగల్లు నిజంగా పోరుగల్లే. పోరాటాలకు పుట్టినిల్లే. ఆనాడు భరతమాత సంకెళ్లు తెంచేందుకు సాగించిన క్విట్ ఇండియా, ఖిలాఫత్ ఉద్యమాలకు ఊపిరిలూదిన ఖిల్లా ఇది… నిజాం నవాబును కూల్చేవరకు మడమ తిప్పని పోరును కొనసాగించిన జిల్లా ఇది తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూడిన జిల్లా నేటి పాలకులు అడుగడుగునా అవమానించినా భరిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే తన సర్వస్వం ధారపోసిన మన జయశంకర్ సార్ పుట్టిన జిల్లా ఇది జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ దాకా అవతరించిన పార్టీని  ఆదరిస్తూ కాషాయ జెండాకు అడుగడుగునా అండగా ఉన్న జిల్లా ఇది ఇయాళ కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియామక పాలనకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తింటోంది ఓరుగల్లు వీరులేనని అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించి నేటికీ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయని దుర్మార్గపు సర్కార్ కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు.తక్షణమే సీ ఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయాలి. లేనిపక్షంలో మెడలు పట్టి కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారమివ్వాలి. అందుకోసమే నిరుద్యోగ మార్చ్ అని అన్నారు.

ఈనెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం… ఆ తరువాత అన్ని ఉమ్మడి జిల్లాలన్నింట్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతాం… ఆ తరువాత లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ఫైలుపై మొట్టమొదటి రోజే సంతకం చేస్తాం. ఎవరు సీఎం అయినా సరే కచ్చితంగా  రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయిస్తామని నొక్కి చెప్పారు.

కేసీఆర్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులందరికీ  నిరుద్యోగ మార్చ్ పక్షాన ఒక నిమిషం పాటు నివాళి అర్పిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫ్రభుత్వ పతనానికి నిరుద్యోగ మార్చ్ నాంది పలుకుతోందని స్పష్టం చేశారు.

ఓరగల్లు నిరుద్యోగ మార్చ్ తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించబోతోందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Related posts

బ్యాన్:శ్రీలంక లో బురఖాపై నిషేధం

Satyam NEWS

దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి కపిల్

Sub Editor

వరలక్ష్మీదేవిగా విజయవాడ కనక దుర్గమ్మ

Satyam NEWS

Leave a Comment