35.2 C
Hyderabad
May 1, 2024 00: 53 AM
Slider మహబూబ్ నగర్

జాతీయ రహదారి, సిద్దేశ్వరం వంతెన సాధనకు ఈ నేతల కృషి

#SiddeswaramBridge

ఇది కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు చిరకాల కోరిక, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నఅంశంపై ఒక క్లారిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈ నిర్ణయంతో కొల్లాపూర్ ప్రాంతమే కాదు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంత అభివృద్ధికి బాటలు పడినట్లే.

ఎంతోమంది నేతలు పార్టీలకతీతంగా సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి కృషి చేశారు. జాతీయ రహదారి ఏర్పాటుకు అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పోరాటం చేశారు. ఎన్నికల సమయంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఇదే అంశంపై హామీ ఇచ్చేవారు.

జూపల్లి కృష్ణారావు కృషి మరువలేనిది

ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, మంత్రిగా ఏళ్ళతరబడి ప్రాతినిధ్యం వహించిన నేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2007లో సింగోటం గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు పడవ ప్రయాణం ద్వారా వస్తూ కొందరు పుట్టి మునిగి కృష్ణా నదిలో ప్రాణాలు వదిలారు.

మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తో  వంతెన నిర్మాణానికి హామీ తెచ్చారు. అంతేకాదు  దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించడంతో పాటు  శిలాఫలకాన్ని కూడా వేశారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు.

సిఎం గా కిరణ్ కుమార్ రెడ్డి బడ్జెట్ పెంచారు

అప్పటికే కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. సోమశిల సిద్దేశ్వరం వంతెన కు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి బడ్జెట్ మరింత పెంచారు. అప్పటికి జూపల్లి మంత్రిగా వున్నారు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా నడుస్తున్నది.

దానితో జూపల్లి తన మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు ఉద్యమం చేశారు. వంతెన అంశం అలాగే నిలిచిపోయింది. కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ జూపల్లి మంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఓడినా హామీ నెరవేర్చేందుకు ఎల్లేని సుధాకర్ రావు విశేష కృషి

కానీ అప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు  విడిపోవడంతో వంతెన అంశం అలాగే మిగిలిపోయింది. వంతెన అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. తర్వాత 2018 ఎన్నికల ముందు కేవైఎఫ్ (కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్) వ్యవస్థాపకుడు  ఎల్లేని సుధాకర్ రావు  కల్వకుర్తి టు నంద్యాల మీదగా జాతీయ రహదారి, సోమశిల సిద్దేశ్వరం వంతెనకు నడుం బిగించారు.

వంతెన మీదగా రహదారి ఏర్పడితే కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని సుధాకర్ రావు పోరాటం చేస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరారు. సుధాకర్ రావు ను గెలిపిస్తే సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి ఏర్పాటు చేస్తామని 2018 డిసెంబర్ 3న కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

అయితే ఎన్నికల్లో సుధాకర్ రావు ఓటమి చవిచూశారు. కానీ ఎక్కడా ఆయన వెనుకడుగు వేయ్యలేదు. వంతెన,జాతీయ రహదారి సాధన కోసం ఢిల్లీ ప్రయాణాలు చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు, జాతీయ కమిషన్, కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రులకు వంతెన,జాతీయ రహదారి ఏర్పడితే  నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధి జరుగుతుందని అప్పటి పార్లమెంటు అభ్యర్థి  బంగారు శృతి తో దిలీప్ చారితో పాటు ఎన్నో ఉన్నతి పత్రాలు ఇచ్చారు.

నాగర్ కర్నూల్ ఎంపి రాములు కృషి

నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు కూడా తన వంతు కృషి చేశారు. కల్వకుర్తి NH167 నుండి నాగర్ కర్నూల్,కొల్లాపూర్ , సోమశిల, ఆత్మకూరు ,  కరివేన NH 340C ను కలుపుతూ తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వయా నూతన జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని ఆయన వినతి పత్రాలు ఇచ్చారు.జాతీయ రోడ్ ట్రాన్స్ పోర్ట్ హైవేస్ సెక్రటరీ గిరిధర్ ను పలుమార్లు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు.

బీరం హర్ష వర్ధన్ రెడ్డి పాత్రా ఉంది

ఇది ఇలా ఉంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొన్ని నెలలకే  టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జాతీయ రహదారి సోమశిల సిద్దేశ్వరం వంతెన సాధించి తీరుతామని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. హామీలు ఇచ్చారు.

ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం  అధికార పార్టీతో సీఎం కేసీఆర్ తో వంతెనపై ఒప్పందంతోనే పార్టీ మారినట్లు తెలిపారు. స్వయంగా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గట్కారి సోమశిల సిద్దేశ్వరం వంతెన,  జాతీయ రహదారికి 765 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేశారు.

రహదారి,వంతెన కొల్లాపూర్ ప్రాంతానికి శుభపరిణామం అభిలాష్ రావు రంగినేని

ఈ ప్రకటనతో కొల్లాపూర్ ప్రాంతంలో ఒక వైపు   బీజేపీ పార్టీ  మరోవైపు గులాబీ పార్టీ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కొల్లాపూర్  ప్రాంతం అభివృద్ధి జరగాలంటే సోమశిల సిద్దేశ్వరం  వంతెన, కల్వకుర్తి నుండి కొల్లాపూర్ మీదగా జాతీయ రహదారి నిర్మాణం కావడం కొల్లాపూర్ ప్రాంతానికి శుభపరిణామమని గులాబీ పార్టీ కొల్లాపూర్ నియోజక వర్గ యువ నాయకులు అభిలాష్ రావు రంగినేని అంటున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడానికి కృషి చేసిన కొల్లాపూర్ తాజా, మాజీ నేతలను ఆయన  అభినందిచాల్సిందే నన్నారు. మరోవైపు బీజేపీ పార్టీ ద్వారానే సోమశిల సిద్దేశ్వరం వంతెన మీదగా  NH167 కరివెన్న NH340c  జాతీయ రహదారికి అనుకూలంగా ప్రకటన రావడం ఎల్లేని సుధాకర్ రావు కృషి  ఫలితమేనని బీజేపీ పార్టీ  శ్రేణులు, కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. గురువారం విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు.

అవుట రాజశేఖర్, కొల్లాపూర్

RajasekahrKollapur
Rajasekahr Kollapur satyam news reporter

Related posts

బాసర గంగపుత్రుల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి

Satyam NEWS

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

Satyam NEWS

టిఎన్జీవోల రాష్ట్ర కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ అభినందన

Satyam NEWS

Leave a Comment