38.2 C
Hyderabad
May 2, 2024 19: 39 PM
Slider ముఖ్యంశాలు

ఐటీసీ ఎంప్లాయ్ విద్యుత్తు సంస్థల సీఎండీ సంతకం ఫోర్జరీ

#ITC employee

తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఉద్యోగ నియామక పత్రం జారీ చేయటంపై ఖైరతాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనంప్రకారం భద్రాచలం వద్ద ఐటీసీ సంస్థలో ప్రవీణ్ ఉద్యోగి. విద్యుత్తు సౌధలో తనకు చాలామంది తెలుసని, ఎలక్ట్రిషియన్గా ఉద్యోగం ఇప్పిస్తానని తాను పనిచేసే చోట కార్మికుడిగా ఉన్న మాడపాటి రాజశేఖర్కు నమ్మబలికాడు. అందుకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

నియామకపత్రం సిద్ధమైన తర్వాతే డబ్బు ఇస్తాననటంతో ప్రవీణ్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్రావు సంతకంతో కూడిన నియామకపత్రాన్ని రాజశేఖర్కు వాట్సాప్ ద్వారా పంపించాడు. డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రాజ శేఖర్కు నమ్మకం కుదరక కూకట్పల్లిలో తనకు తెలిసిన ఎన్.

సురేంద్రకుమార్ అనే వ్యక్తికి ఆ పత్రాన్ని పంపించారు. అతడు ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధకు వచ్చి ఆరా తీయగా, టీఎస్ జెన్కో విజిలెన్స్ విభాగం దానిపై విచారించి సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్ పై కేసు నమోదు చేసినట్లు ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు.ఏ ఉద్యోగమైనా సంబంధిత శాఖ నుంచి నోటిఫికేషన్ ద్వారానే వస్తుందని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు.

పరీక్షలు, అర్హతల ఆధారంగానే అభ్యర్థులు ఎంపికవుతారని చెప్పారు. విద్యుత్తు సంస్థల్లో ప్రస్తుతం ఖాళీలులేవని, తప్పుడు ప్రచా రాన్ని నమ్మొద్దని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related posts

మాస్క్, లైసెన్స్ , హెల్మెట్ లేకుంటే… మీ ప‌ని ఇక అంతే…!

Satyam NEWS

అరుణాచల గిరి ప్రదర్శనకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు

Satyam NEWS

కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment