38.2 C
Hyderabad
April 29, 2024 20: 09 PM
Slider ముఖ్యంశాలు

కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి

venkaiahnaidu 23

ఆంధ్ర విద్యావర్ధిని (ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూవరంగల్‌ అంటే ఎంతో ప్రేమ, అనుబంధం ఉంది. విద్య, సాహిత్య, సాంస్కృతిక కేంద్రమైన వరంగల్‌కు రావడం ఆనందంగా ఉందని అన్నారు.

కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని తెలిపారు. మాతృభాషను జన్మభూమిని మరచిపోవద్దు. మాతృభాషలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరగాలి. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్,  పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ తదితరులు ఉన్నారు.

Related posts

అక్రమాలను ప్రశ్నించినందుకే రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కామ్రేడ్లు రాస్తారోకో…!

Satyam NEWS

జోర్డాన్ పార్లమెంట్‌లో ఎంపీల రచ్చ

Sub Editor

Leave a Comment