29.7 C
Hyderabad
April 29, 2024 10: 02 AM
Slider ప్రపంచం

టూ లేట్ : సులేమానీని ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్‌

trump sulemani

ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్‌ ధ్వంసం చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. ఆ దాడుల్లో ఒక్క అమెరికన్‌ కూడా చనిపోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో ఇరాన్‌ ముందుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ విషయంలో అమెరికా శాంతిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఒకవేళ ఇరాన్‌ ఇంకా దాడులకు పాల్పడితే అమెరికా బలగాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇరాన్‌ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోందని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు ఇరాన్‌ను సహిస్తూ వస్తున్నాయన్నారు. సులేమానీని ఎప్పుడో హతమార్చాల్సి ఉందని, కానీ అది ఇప్పుడు జరిగింది. జీవితం మీద ఆశ ఉంటే తమపై దాడులు చేయవద్దని ముందే ఉగ్రవాదులకు సందేశం పంపించామని ఆయన పేర్కొన్నారు.

Related posts

కడప జిల్లా లో ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు

Satyam NEWS

విజయనగరం లో విశాఖ రేంజ్ డీఐజీ…!

Satyam NEWS

ముగిసిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష

Satyam NEWS

Leave a Comment