38.2 C
Hyderabad
May 3, 2024 21: 02 PM
Slider హైదరాబాద్

స్వ‌ల్పంగా పెరిగిన పోలింగ్ శాతం

GHMC-poll-boothjpg

2020 జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌ల్లో పెరిగిన పోలింగ్‌ శాతం 149 డివిజ‌న్లలో 46.6 శాతం పోలింగ్ జ‌రిగింది. 2016 బ‌ల్దియా ఎన్నిక‌ల్లో 45.29 శాతం పోలింగ్ న‌మోదు కాగా, 2016 ఎన్నికలతో పోలిస్తే అధికంగా 1.31 శాతం పోలింగ్ న‌మోదైంది.

మలక్ పేట్ ఎన్నిక వాయిదా ప‌డ్డ విష‌యం విదిత‌మే. రేపు ఈ ఎన్నిక‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నుండ‌గా మరింత ఓటింగ్ శాతం పెరగనుంది. గ్రేటర్​ ప్ర‌జ‌లు జీహెచ్ఎంసీ పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 150 డివిజ‌న్ల‌కు పోటీ జ‌రిగింది. ఓల్డ్ మ‌ల‌క్‌పేట డివిజ‌న్‌లో బ్యాలెట్ పేప‌రుపై సీపీఐ గుర్తుకు బ‌దులు సీపీఎం గుర్తును ముద్రించ‌డంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆ డివిజ‌న్ ఎన్నిక‌ను ర‌ద్దు చేసింది. డిసెంబ‌రు 3న రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 149 డివిజ‌న్ల‌లో మొత్తంగా 46.6 శాతం మంది ఓటేశారు.

ఓటు వేసిన‌వారు

ఓటు వేసిన వారిలో పురుషులు-18,57,041 కాగా, మ‌హిళ‌లు 15,97,438, ఇత‌రులు 73, మొత్తం 34,54,552 ఓటు వేశారు. ఈ ఎన్నిక‌ల్లో 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌గా, 36,404 సిబ్బంది సేవ‌లందించారు.

గ్రేట‌ర్‌లోని జోన్లు – 6 వాటి ప‌రిధిలోని స‌ర్కిళ్లు – 30, మొత్తం డివిజ‌న్లు – 150.

కాగా 10 నుంచి 40శాతం లోపు పోలింగ్ న‌మోదైన డివిజ‌న్లు – 17 ఉండ‌గా, 40 నుంచి 50శాతం లోపు పోలింగ్‌ న‌మోదైన డివిజ‌న్లు – 93, 50శాతానికి పైగా పోలింగ్ న‌మోదైన డివిజ‌న్లు – 39, అత్య‌ధిక పోలింగ్ న‌మోదైన ప్రాంతాలు కంచన్​బాగ్​ 70.39%, ఆర్సీపురం 67.71%, ప‌టాన్‌చెరు 65.77%, భార‌తిన‌గ‌ర్ 61.89%, గాజుల‌రామారం 58.61%, నవాబ్‌ సాహెబ్‌ కుంట 55.65%, బౌద్ధనగర్‌ 54.79%, దత్తాత్రేయనగర్ 54.67%, రంగారెడ్డిన‌గ‌ర్ 53.92%, జంగంమెట్ 53.8%.

అత్య‌ల్ప పోలింగ్

యూసుఫ్‌గూడ 32.99%, మెహదీపట్నం 34.41%, సైదాబాద్ 35.77%, సంతోష్‌‌ నగర్ 35.94%, మియాపూర్ 36.34%, త‌క్కువ పోలింగ్ న‌మోదైన డివిజ‌న్ల‌లో పాత‌బ‌స్తీవే అధికంగా ఉన్నాయి. చివ‌రి 20 డివిజ‌న్ల‌లో 9 పాత‌బ‌స్తీలోనివే.
మెహదీప‌ట్నం, సైదాబాద్‌, సంతోష్‌న‌గ‌ర్‌, మూసారంబాగ్‌, విజ‌య‌న‌గ‌ర్‌కాల‌నీ, ఆజంపురా, అక్బ‌ర్‌బాగ్‌, డబీర్‌పురా‌, ఐఎస్ స‌ద‌న్‌.

త‌ర్వాతి స్థానంలో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్లు. మియాపూర్‌, హైద‌ర్‌న‌గ‌ర్‌, మాదాపూర్‌, చందాన‌గ‌ర్, హఫీజ్‌పేట‌, అల్విన్‌ కాలనీ, శివారు ప్రాంతాల్లో భారీగా న‌మోదైన పోలింగ్ ‌ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆర్సీపురం, ప‌టాన్‌చెరు, భార‌తిన‌గ‌ర్‌ డివిజ‌న్లలో చైత‌న్యం వెల్లి విరిసింద‌నే చెప్పాలి.

స‌ర్కిళ్ల వారీగా చూస్తే

ప‌టాన్‌చెరులో 65.09శాతం, గోషామహల్‌ 51.8శాతం, హ‌య‌త్‌న‌గర్​లో 51.04శాతం, గాజుల‌రామారంలో 53.65శాతం, చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో 53.07శాతం నమోదైంది.

4న కౌంటింగ్‌

150 డివిజ‌న్ల‌ ఓట్ల లెక్కింపు చేయనున్నారు. స్ట్రాంగ్ రూముల్లో ఓట‌రు తీర్పు భద్రంగా ఉంచారు. గ‌తంక‌న్నాపోలింగ్ స్వ‌ల్పంగా ఎక్కువగానే నమోదైంది. కోవిడ్‌, వ‌రుస సెల‌వులు లేకుంటే మ‌రింత పెరిగేదంటున్నారు ఎలక్షన్ కమీషర్ అధికారులు

Related posts

మిస్టరీ:కాకతీయ కాలువ ప్రమాదం పై సందేహాలు

Satyam NEWS

ఉత్తర కర్ణాటకలో భారీ వర్షంతో కల్లోలం

Satyam NEWS

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment