28.7 C
Hyderabad
April 28, 2024 05: 40 AM
Slider గుంటూరు

జిల్లా ఆసుపత్రిగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి

#vidudalarajani

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల వద్ద ఏర్పాటుచేసిన వైయస్సార్ రెండు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి 350 పడకలతో జిల్లా ఆసుపత్రి గా ఏర్పాటు చేసే విధంగా తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. బుధవారం ఉదయం నరసరావుపేట లింగంగుంట్ల వద్ద నూతనంగా నిర్మించిన 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి మరియు స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శిలా ఫలకం ఆవిష్కరణ అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.ఆసుపత్రి భవనం లో రెడ్ క్రాస్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను జ్యోతి ప్రజ్వలన అనంతరం వైద్య శాఖ మాత్యులు శ్రీ విడుదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యం పై ఇప్పటి వరకు 16000 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అందులో భాగంగా నేడు21 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించు కోవడం జరిగిందన్నారు.

ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆటోమేటిక్ మిషన్ ద్వారా 140 రకాలు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వ వైద్యశాలలో అందించే సేవలను వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.జిల్లాలో సత్తెనపల్లి లో ఉన్న 50 అడగలే ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మరియు మాచర్లలో 30 ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా విజయపురి సౌత్ లో ఉన్న ఆసుపత్రి 20 పడకల నుంచి 30ఆసుపత్రిగా పెదకూరపాడు నియోజకవర్గంలోని 30 పడకల ఆసుపత్రి నీ రూ. 8.6 కోట్లు తో అభివృద్ధి చేసే విధంగా అమరావతి లో ఉన్న 30 పడకల ఆసుపత్రిని మూడు కోట్ల 30 లక్షల రూపాయలు తో అభివృద్ధి చేసే విధంగా వినుకొండ 30 పడకల ఆసుపత్రిని రెండు కోట్ల 10 లక్షల రూపాయలతో ఈపూరు లో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 5 కోట్ల రూపాయలతో అదేవిధంగా చిలకలూరిపేట ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయుటకు 19 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

పిడుగురాళ్ల లో 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 3254 సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని తదుపరి ఆ కార్యక్రమంపై విశ్లేషించి మార్పులు చేర్పులు చేసి సంక్రాంతి లేదా ఉగాది నాటికి ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

నరసరావుపేటలో ఏర్పాటుచేసిన ఆసుపత్రికి సంబంధించి వైద్యుల నియామకం, శానిటేషన్ సెక్యూరిటీ అంశాలపై స్థానిక శాసనసభ్యులు అభ్యర్థన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఈ ఆసుపత్రిలో వేల మందికి వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారని అందుకు చిత్తశుద్ధితో పని చేసిన నర్సులను సిబ్బందిని ఆయన అభినందించారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతు సహకారం అందించడం జరిగిందన్నారు.

200 పడకల ఆసుపత్రి ప్రాంగణంలో చిత్తూరు జిల్లాలో జరిగినట్లుగా ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులకు సూచించారు. పిడుగురాళ్ళ లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ కి సంబంధించి 50 శాతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని ఆయన అన్నారు.

నరసరావుపేటలో 200 పడకల ఆసుపత్రి కి అనుబంధంగా ప్రైవేట్ వైద్య కళాశాల ఏర్పాటు చేసే విధంగా స్థానిక శాసనసభ్యులు తో కలిసి ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఏర్పాటు అయిన నాటి నుండి నేటి వరకు వైద్యరంగంలో ఇప్పటివరకు ఏడు వందల కోట్ల రూపాయల లను వెచ్చించడం జరిగిందన్నారు. నేడు ప్రారంభించు కున్న 200 పడకల ఆసుపత్రిలో స్థానిక శాసనసభ్యులు కృషి అభినందనీయమన్నారు.200 పడకల ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. స్థానిక శాసనసభ్యులు దూరదృష్టి చాలా గొప్పది అని స్వతహాగా ఆయన డాక్టర్ అయినందున 200 పడకల ఆసుపత్రి ఏర్పాటులో తన సలహాలు సూచనలు తోపాటు అవిరళ కృషి చేశారన్నారు.

ఆస్పత్రి నిర్వహణలో సూపరింటిండెంట్ జాగరూకత వహించి ఏ ఏ సేవలు ఎక్కడ ఎక్కడ అందిస్తున్నారు వివరాలను అందరికీ అర్థమయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వచ్చే విధంగా పూర్తి ఆటోమేటిక్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతతో కూడిన అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

అందుకోసం రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అన్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ చేయడం జరిగిందని దానికి సంబంధించిన పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని రానున్న రెండు మూడు నెలలలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.ఆసుపత్రిలో 23 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒకటిన్నర కోట్ల రూపాయలతో పవర్ గ్రిడ్ సహాయంతో సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కోవిడ్ సమయంలో వేల మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.

వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటివరకు చాలా పోస్టులను రిక్రూట్ చేయడం జరిగింది అన్నారు. ఆసుపత్రు లో 4 డయాలసిస్ యూనిట్లు ఉన్నాయని దాతల సహకారంతో మరో ఆరు డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఆర్ డి ఓ శేషి రెడ్డి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రంగారావు, డిఎంఅండ్హెచ్ఓ శోభ రాణి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శేషి రెడ్డి ,శ్రీనివాసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

వై ఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

Bhavani

మంత్రి కేటీఆర్ రాక కోసం పటిష్ట పోలీసు బందోబస్తు

Satyam NEWS

Leave a Comment