28.7 C
Hyderabad
April 27, 2024 05: 36 AM
Slider కడప

స్నేహిత అమృత హస్తం సేవాసమితి కి “మానవత్వ ధీర” అవార్డు

#kadapa police

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ విపత్తు లో ఉత్తమ సేవలు అందించిన ఉత్తమ సేవాసమితి లకు ఏర్పాటు చేసిన మానవత్వ ధీర అవార్డు ల ప్రధానోత్సవం కడపలో జిల్లా ఎస్. పి అంబురాజన్ ఘనంగా నిర్వహించారు.

కోవిడ్ విపత్తులలో గత సంవత్సరం నుండి స్నేహిత అమృత హస్తం సేవాసమితి బృందం చేస్తున్న విస్తృత సేవలను గుర్తించి కడప జిల్లా లోనే ఉత్తమ సేవాసమితి గా మొదటి స్థానం లో ఉన్నట్లు గుర్తించి పులివెందుల పోలీస్ శాఖ నివేదికలు పంపడం జిల్లాకు పంపడం జరిగింది.

శుక్రవారం కడప జిల్లా ఎస్ పి కార్యాలయం లో జరిగిన స్వచ్చంద సేవకులకు నిర్వహించిన అభినందన సభలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి సేవలను జిల్లా ఎస్.పి అంబురాజన్ స్వయంగా సేవాసమితి సేవలను విపత్తు లలో చేసిన  సేవలను కొనియాడుతూ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

సేవాసమితి బృందం సేవలను గుర్తించిన పులివెందుల సి. ఐ భాస్కర్ రెడ్డి, ఎస్ ఐ లు చిరంజీవి, గోపీనాథ్ మరియు పులివెందుల పోలీస్ శాఖ కు, జిల్లా ఉత్తమ అవార్డు ప్రధానం చేసిన ఎస్. పి అంబురాజన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు వారి బృందం తెలిపారు.

ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ విపత్తులలో రెడ్ జోన్ లలో కోవిడ్ బాధితులకు, లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు చేసిన సేవలకు, వెంటి లేటర్ పైన ఉన్న కోవిడ్ బాధితులకు ప్లాస్మా దానం, రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యమాలను నిర్వహించారు.

ప్రస్తుతం 2 వ దశ కోవిడ్ వ్యాప్తి లో కోవిడ్ కు గురై మృతి చెందిన మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం, కోవిడ్ కారణం గా ఇంటి యాజమానిని కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడం లోను సేవాసమితి చేస్తున్న సేవలకు గుర్తింపు గా శుక్రవారం కడప ఎస్.పి అంబురాజన్ చేతులమీదుగా దుశ్శాలువా, పూల మాలలు వేసి మానవత్వ ధీర అవార్డు ను సేవాసమితి అధ్యక్షులు రాజు అందుకున్నారు.

ఈ అవార్డు వెనుక సేవాసమితి సభ్యుల సహకారం ఎంతో ఉన్నదని ఈ అవార్డు సేవాసమితి సభ్యులకు అంకితం చేస్తున్నట్టు మొమ్మెల రాజు తెలిపారు.

Related posts

రివాల్వర్ తో స్వైర విహారం చేసిన మజ్లీస్ నాయకుడు

Satyam NEWS

మార్చి 8వ తేదీ నుంచి పురపాలక శాఖ మహిళా వారోత్సవాలు

Murali Krishna

లాండ్రీ, కటింగ్ షాపులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

Leave a Comment