38.2 C
Hyderabad
May 2, 2024 20: 03 PM
Slider హైదరాబాద్

అభినయంతో ఆహా అనిపించిన స్నిగ్ధ

#dance

తన తొలి ప్రదర్శన తోనే ఆహా అనిపించారు కుమారి స్నిగ్ధ. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా శనివారం కుమారి స్నిగ్ధ చేసిన కూచిపూడి నృత్యం  ఆహుతులను అలరించింది. వేలాది మంది కలాభిమానుల సమక్షంలో సాగిన కుమారి స్నిగ్ధ క్యాతారి నృత్య రంగ ప్రవేశం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తన అభినయంతో ఆహుతుల మనస్సులు దోచిన స్నిగ్ధ క్యాతారి, కళలు ఉన్నత విద్యాభ్యాసంకు ఆటంకం అన్న నానుడికి ముగింపు పలుకుతూ, కేవలం నృతం లోనే కాక, ఐఐటి లో ఉన్నత విద్యను పూర్తిచేసి అమెజాన్ లో కీలక విధులు నిర్వర్తిస్తుండటం ప్రత్యేకత. తొలి ప్రదర్శనకు మాజీ ఉప కులపతి ఆచార్య ఏన్ గోపి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజ రెడ్డి హాజరై స్నిగ్ధ నృత్యాభినయం  అభినందనీయం అన్నారు.

పిన్న వయస్సులోనే సీనియర్ కళాకారిణి స్థాయిలో తన నేత్రాలతో హావభావాలను పలికించారన్నారు. ప్రముఖ నాట్య కళాకారిణి డాక్టర్ మద్దాలి ఉషా గాయత్రి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించగా, తన తల్లిదండ్రులు గురుమూర్తి, పద్మావతి  నిరంతర ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని స్నిగ్ధ క్యాతారి పేర్కొన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యాలయం “నృత్య కిన్నెర” సంస్థ ద్వారా ప్రదర్శన నిర్వహించారు.

Related posts

రాజంపేట లో వైసీపీ కి ఎదురు దెబ్బ….

Satyam NEWS

పేదోడి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు…

Satyam NEWS

కొత్త రెవెన్యూ చట్టం రైతన్నకు వరం

Satyam NEWS

Leave a Comment