29.2 C
Hyderabad
November 8, 2024 14: 39 PM
Slider ఆదిలాబాద్

కొత్త రెవెన్యూ చట్టం రైతన్నకు వరం

#MinisterIndrakaranReddy

కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా  తొలగనున్నాయయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

మంగ‌ళ‌వారంలో కొత్త రెవెన్యూ  చట్టానికి నాంది పలికిన సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌గా ఆసిఫాబాద్ జిల్లా  నార్నూర్ లో నిర్వ‌హించిన ఎడ్ల‌  బండ్ల ర్యాలీలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి స్థానిక రైతులు, మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ,  ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలను అడ్డుకునేందుకే  సీయం కేసీఆర్ కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చార‌న్నారు.

ఇప్ప‌టి వరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్‌ కోసం  రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేద‌ని, ఇప్పుడు ఆ సమస్య ఉండద‌ని పేర్కొన్నారు.

మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొన్నవారి పేర భూమి బదిలీ అవుతుందని, గుంట భూమి కూడా ఆక్ర‌మించే అవ‌కాశం లేద‌ని వెల్ల‌డించారు. నూతన రెవెన్యూ చట్టంతో అవినీతికి  చెక్‌ పడనున్నదని చెప్పారు.

కొత్త రెవెన్యూ చ‌ట్టంతో పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంద‌ని, లంచం ఇవ్వ‌డం, తీసుకోవ‌డం నేర‌మేన‌ని, ఎవ్వ‌రూ కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున్న ద‌స‌రా నాడే ఈ ధరణి పోర్టల్ ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ఆత్రం స‌క్కు, రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్  కోవా ల‌క్ష్మి, ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధన్, మాజీ ఎంపీ న‌గేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మల్లన్న ను దర్శించుకుందాం

Satyam NEWS

తిరుమలలో రేపు కార్తీక వన భోజనోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment