Slider ముఖ్యంశాలు

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ విద్యుత్ చార్జీలు

vinodkumar

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం కనీస సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, నవ్వి పొదురు గాక నాకేమీ సిగ్గు.. అన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకుల పరిస్థితి ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

కనీసం వాస్తవాలను కూడా తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నాయకులు పాదయాత్రలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తిమ్మిని బమ్మి చేయడమే మా తెలివి తేటలు అనే రీతిలో బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్నారని వినోద్ కుమార్ అన్నారు. కనీసం పాదయాత్రలో అయినా వాస్తవాలు మాట్లాడాలని ఆయన బీజేపీ రాష్ట్ర నాయకులకు సూచించారు.

బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువ ఉండగా, కేవలం 7 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా ఉందని,  అదే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తక్కువ, 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సాగుతోందని వినోద్ కుమార్ వివరించారు. వ్యవసాయానికి రైతులకు 24 గంటల ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ ఒక్కటే అని ఆయన తెలిపారు. పరిశ్రమలకు కూడా ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ టారిఫ్ లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరదృష్టి వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సాధ్యమయ్యాయని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని జీర్ణించుకోలేని బీజేపీ రాష్ట్ర నాయకులు తప్పుడు ప్రచారానికి నడుం బిగించారని ఆయన విమర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులులారా..!  వాస్తవాలను గ్రహించండి, రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోండి.. అని వినోద్ కుమార్ హితవు పలికారు. బీజేపీ పాలిత, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా వసూళ్లు చేస్తున్న విద్యుత్ చార్జీల టారిఫ్, తెలంగాణ రాష్ట్రంలో తక్కువ స్థాయిలో ఉన్న విద్యుత్ చార్జీల టారిఫ్ ఇదిగో.. అని జాబితాను వినోద్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్రాల వారీగా గృహ విద్యుత్ చార్జీలు

100 యూనిట్స్  — 200 యూనిట్స్

తెలంగాణ —   3.49   — 4.76

కర్నాటక  —    7.39  —  8.07

గుజరాత్ —    6.35 —   6.83

ఉత్తర్ ప్రదేశ్ – 4.20  —  7.64

రాజస్థాన్ —    8.49  —  8.21

ఛత్తీస్ ఘడ్ – 4.32 —   4.32

Related posts

కరోనా రక్కసిని గెలిచిన చిన్ని కృష్ణుడు

Satyam NEWS

మాజీ ప్రధాని పివి నర్సింహారావు శత జయంతి వేడుకలు

Satyam NEWS

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో చిన జీయర్ స్వామి

Satyam NEWS

Leave a Comment