36.2 C
Hyderabad
May 12, 2024 16: 59 PM
Slider విజయనగరం

మేము సైతం స‌మిధిల‌వుతాం అంటున్న‌40 ఏళ్ల క్రితం నాటి బాయ‌స్…!

#socialservice

ప్రార్ధించే పెద‌వులక‌న్నా…సాయం చేసే చేతులే మిన్న అంటున్న‌స‌త్యం న్యూస్.నెట్

మేము స‌హితం ప్రపంచానికి స‌మిధ‌ల‌వుతాంఅన్న శ్రీశ్రీ ర‌చ‌నే వారికి  సూర్పిదాయ‌కం. ఆప‌దలో ఎవ్వ‌రు ఉన్నా…ఆదుకునే త‌త్వం వాళ్ల‌ది.. అన్నార్తుల ఆక‌లిని తీర్చే  సేవాత‌త్స‌రత  ఆ బాయ‌స్ ది వాళ్లే…1982లో పార్వ‌తీపురం ఆర్సీఎం స్కూల్ లో టెన్త్ చ‌దువుకున్న విద్యార్దులు. ఇటీవలే ల‌య‌న్స్ క్ల‌బ్  లో  చైల్డ్ హుడ్ మీట్ తో క‌లుసుకున్న ఆ 1982 టెన్త్ క్లాస్ బ్యాచ్..త‌మ‌కు అక్ష‌రం ముక్క దిద్దించిన గురువుల‌ను ఇతోదికంగా సత్క‌రించుకున్నారు.ఇక అక్క‌డ నుంచీ త‌లో కొంత వేసుకుని సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని ఆ గురువుల ముందే ఓ ర‌కంగా ప్ర‌తిజ్ఙ చేసారు.

దాదాపు 40 ఏళ్ల క్రితం పార్వ‌తీపురం ఆర్.సీ.ఎం స్కూల్ లో టెన్త్ చ‌దువుకున్న  ఆ విద్యార్ధులంతా..నేడు ఒక్కొక్కొరు ఒక్కో స్థాయిలో ఉండ‌టం అందునా…పార్వ‌తీపురం కేంద్రంగా త‌లో చయ్యి వేసి  స‌మాజ‌హిత కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం  చుట్టారు. ఇటీవ‌లే…పార్వ‌తీపురంలో చ‌లివేంద్రాన్ని మొద‌లు పెట్టిన వాళ్లు…తాజాగా నిరాశ్ర‌యుల‌కు అలాగే అన్నార్త‌లు ఆక‌లి ద‌ప్పిక‌ల‌ను తీర్చాల‌ని అనుకున్నారు ఇలా అనుకున్న త‌డ‌వు..త‌లో కొంత వేసుకున్నారు.

అంతే రెడ్డి శ్రీను, చింతాడ విశ్వం,  కేయూ భాస్కర్,  వై భాస్కర్,  బీవీఎస్ సాయి కుమార్ రాంభట్ల శ్రీను, కోట్ని శ్రీను, ఎమ్ కుర్నారావు, వారణాసి శ్రీను, ప్రసాదులు తలో కొంత వేసుకుని…నిన్న చ‌లివేంద్రం ప్రారంభిస్తే…తాజాగా ప‌ట్ట‌ణంలోని  ఆనాధ శ‌ర‌ణాల‌యంకు వెళ్లి…ఓ పూట అందులో ఉన్న అన్నార్తుల‌కు…మేమున్నాం అంటూ భోజ‌న‌స‌దుపాయం క‌ల్పించారు.

కాదు…కాదు…ద‌గ్గ‌రుండీ వాళ్లంద‌రికీ వ‌డ్డించి…వారి అక‌లి బాధ‌ను తొల‌గించే నారాయణ‌మూర్తుల‌య్యారు. ప్రార్ధించేప‌ద‌వుల క‌న్నా…సాయం చేసే చేతులే మిన్న అన్న నానుడుని రుజువు చేసిన‌……1982 పార్వ‌తీపురం ఆర్సీఎం  బ్యాచ్ కు హేట్సాఫ్ చెబుతోంది….స‌త్యం న్యూస్.నెట్

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మైనంపల్లిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

Satyam NEWS

తెలుగు తేజం

Satyam NEWS

వెంకటేష్ హీరోగా తెలుగులో ‘అసురన్’

Satyam NEWS

Leave a Comment